కొన్ని పనులు తెలిసి చేసావో లేక తెలియక చేసావో, రెండూ కాక సరదా కోసం చేసావో కానీ జనాలను ఆశ్చర్యపరుస్తూంటాయి. తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లిన విషయం తెలిసిందే.
అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ ఫ్లెక్సీలతో బీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశాయి. ఓ వైపు కేసీఆర్, మరోవైపు బన్నీ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్.. తగ్గేదేలే” అని రాసుకొచ్చారు.
ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, దీనిపై ఎక్స్ ప్లాట్‌ఫాంపై పలు పోస్టులు వెల్లువెత్తాయి. ఒక పోస్టులో, “బీఆర్ఎస్ రజతోత్సవ సభలో(BRS Silver Jubilee Celebrations) అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీ” అంటూ దాని చిత్రాన్ని షేర్ చేశారు. మరొక పోస్టులో, అల్లు అర్జున్‌ను ‘ఐకన్ స్టార్’గా సంబోధిస్తూ, కేసీఆర్ నాయకత్వాన్ని బ్రాండ్‌గా పోల్చారు.
అల్లు అర్జున్ (Allu Arjun)తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకన్‌గా పేరు సంపాదించారు, ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’ సినిమా తర్వాత ఆయన జనాదరణ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమాలో ఆయన పాత్ర మరియు డైలాగులు యువతలో బాగా పాపులర్ అయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు ఈ జనాదరణను ఉపయోగించుకుని, కేసీఆర్ నాయకత్వాన్ని ఒక బ్రాండ్‌గా చిత్రీకరిస్తూ ఈ ఫ్లెక్సీని రూపొందించారు. ఇది సభకు హాజరైన యువతను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది.