అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఘాటి సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ, మొదటి రోజు ఇండియాలో కేవలం రూ.2 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే సాధించింది. రెండో రోజు (శనివారం) ఇంకా దారుణంగా, కేవలం రూ.1.74 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే రెండు రోజులకు మొత్తం రూ.3.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ క్రమంలో శనివారం ఆక్యుపెన్సీ కూడా కేవలం 23% వద్దే ఆగిపోయింది.
అనుష్క స్టార్డమ్తో పోలిస్తే, ఇవి పెద్ద డిజాస్టర్ కలెక్షన్లే అని ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, ఫస్ట్ డే రూ.2.4 కోట్లు , రెండో రోజు రూ.2.23 కోట్లు రాబట్టింది. కానీ ఈసారి ఫీమేల్ సెంట్రిక్ ఘాటి మాత్రం అనుకున్నంత హిట్ ఇవ్వలేకపోయింది.
అయితే, అనుష్క యాక్షన్ సీక్వెన్స్లు, నటన మాత్రం మంచి ప్రశంసలు తెచ్చుకుంటున్నాయి. కానీ కలెక్షన్స్ వద్ద మాత్రం ఆ మ్యాజిక్ జరగలేకపోయింది.
లిటిల్ హార్ట్స్ సక్సెస్ జోరు
ఇక ఘాటి తో పాటు విడుదలైన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ మాత్రం పేరు చిన్నదే కానీ వసూళ్లలో పెద్దదిగా దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రూ.1.32 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, రెండో రోజు శనివారం ఏకంగా రూ.2.5 కోట్లు రాబట్టి, 85% గ్రోత్ చూపించింది. పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీతో వేగం పెరుగుతోంది.
ఘాటి బడ్జెట్ షాక్
ఘాటి కోసం దాదాపు రూ.50 కోట్లు బడ్జెట్ వెచ్చించారని, ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రూ.52 కోట్లు జరిగినట్లు సమాచారం. కానీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.55 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ కావాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే, ఘాటి కి నష్టాలే తప్ప దారి లేదన్నది ట్రేడ్ టాక్!