సినిమా పరిశ్రమలో కాపీ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. కోర్టుకు ఎక్కుతున్నాయి. కేవలం కథలకే కాదు. సాంగ్స్ కూడా కాపీ కొట్టేస్తున్నారు. అదీ ఏ ఆర్ రెహమాన్ వంటి వారు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే…

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసులో పిటిషన్‌దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్ (AR Rahman) , చిత్ర నిర్మాణ సంస్థను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష (Trisha), ఐశ్వర్యరాయ్‌ తదితరులు ముఖ్య తారాగణంగా నటించి 2023లో విడుదలైన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’.

ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించిన ‘వీరా రాజ వీరా’ పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్‌ డగర్, మామ జాహిరుదీన్‌ డగర్‌ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు దిల్లీ హైకోర్టులో గాయకుడు ఉస్తాద్‌ ఫయాజ్‌ వసిఫుదీన్‌ డగర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ కేసులో శుక్రవారం మధ్యంతర తీర్పు వెలువడింది. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ రూ.2 కోట్లను, చిత్రంలో క్రెడిట్ను పిటిషన్‌దారుడికి అందించాలని ఆదేశించింది.

, , , ,
You may also like
Latest Posts from