రీరిలీజ్ లు సీజన్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిత్య 369’ కూడా రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు బాలకృష్ణ బాగా ప్రమోట్ చేసారు.ఆయనకు సీక్వెల్ ఆలోచన ఉండటంతో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని భావించారు.

ప్రమోషన్స్ తో ఈ సినిమా రీరిలీజ్ బజ్ భారీగా క్రియేట్ అయ్యినా అది థియేటర్ రివెన్యూగా మారలేదు. ఈ సినిమా రీరిలీజ్ వెర్షన్ బాగా ఆడుతుందని బాలయ్య చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుుకున్నారు. అవి నీరుగారిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ఆలోచనపై నీలి నీడలు కమ్ముకునే అవకాసం కనపడుతోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రీరిలీజ్ వెర్షన్ వర్కవుట్ కాలేదు. ఎక్కడా అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ రాలేదు. బాలకృష్ణకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్నా ఈ సినిమా వర్కవుట్ కాకపోవటం కారణం…ఈ సినిమా ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం ఉన్నది కాదని, కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రం అని, సినిమాని ఇప్పటికే చాలా సార్లు ఉండటంతో పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి చూడలేదని విశ్లేషిస్తున్నారు.

ఇది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ. 1991 ఆగస్టు 18న థియేటర్లలో రిలీజయింది. టైం మెషీన్ కథాంశంతో ప్రస్తుత కాలానికి భవిష్యత్ వర్తమానాలను లింక్ చేస్తూ తీసిన ఈ చిత్రం.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

దాదాపు 34 ఏళ్ల క్రితం సినీ అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. ఈ జనరేషన్ ఆడియన్స్ ను అలరించడానికి మరోసారి థియేటర్లలోకి వచ్చింది. అధునాతన సాంకేతిక సొగసులు అద్దుకుని ఈరోజు (ఏప్రిల్ 4) 4K వెర్షన్ లో రీ-రిలీజ్‌ అయింది.

,
You may also like
Latest Posts from