ఇప్పుడు అందరి హీరోల దృష్టీ ప్యానిండియా సినిమాలపైనే ఉంది. అదే క్రమంలో బాలయ్య సినిమాలు సైతం ప్యానిండియా రిలీజ్ లకు ప్రయత్నించారు కానీ జరగటం లేదు. అయితే ఇప్పుడు బాలయ్య ఓ ప్యాన్ ఇండియా చిత్రంలో చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంతకీ ఆ ప్రాజెక్టు డిటేల్స్ ఏమిటి అంటే…

రజనీకాంత్, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ల మోస్ట్ ఎక్సెపెక్టింగ్ సీక్వెల్, జైలర్ 2. ఈ చిత్రం ప్రకటన టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఆడియన్స్ లో సినిమాపై హైప్‌ను పెంచింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

తమిళ వర్గాల నుంచి అందుతున్న స్ట్రాంగ్ బజ్ ప్రకారం, జైలర్ 2 లో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ నటించాలని ప్లాన్ చేస్తున్నారు.

నెల్సన్ దిలీప్‌కుమార్, తన ఇంటర్వ్యూలలో, జైలర్‌లో బాలకృష్ణను ఒక ముఖ్యమైన పాత్రలో నటింపజేయాలని తాను ఇప్పటికే ప్లాన్ చేశానని, అయితే కొన్ని పరిస్థితుల వల్ల అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నాడు.

మొదట్లో, నెల్సన్ దిలీప్‌కుమార్ జైలర్‌లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి, అయితే ఆఫర్ గొప్పగా అనిపించక బాలకృష్ణ ఆఫర్‌ను తిరస్కరించారు.

మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ భారీ ప్రకంపనలు సృష్టించారు. వారు జైలర్ 2 కోసం తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనంగా, బాలకృష్ణ కూడా ఈ అదిరిపోయే సీక్వెల్ లో భాగం కావచ్చు.

దానికి తోడు రజనీకాంత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహితులు కావటం, బాలకృష్ణ టిడిపి ఎమ్మెల్యే, రజనీకి సన్నిహిత మిత్రుడు కూడా అయినందున ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కే అవకాసం ఇప్పుడు ఎక్కువగా ఉంది. నెల్సన్ ఈసారి బాలయ్యకు రాసే పాత్ర ఖచ్చితంగా మంచిదే అవుతుంది.

, , ,
You may also like
Latest Posts from