‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ హీరోగానే మాత్రమే కాకుండా, ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా కూడా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన బ్రాండ్ పేరు OMI – ఇందులో ‘Om’ (ఆధ్యాత్మికత), ‘I’ (నేను) అనే భావాలు కలిపి ఉన్నాయి.

ఈ బ్రాండ్ లోగోను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. సాధారణ ప్రొడక్షన్ హౌస్‌లా కాకుండా, OMI ఒక మల్టీ-డైమెన్షనల్ ప్లాట్‌ఫారమ్ . ఇందులో సినిమాల నిర్మాణం మాత్రమే కాదు, వెల్‌నెస్ ప్రొడక్ట్స్ , హాస్పిటాలిటీ వెంచర్స్ వంటి విభిన్న రంగాల్లో అడుగుపెడుతుంది.

శర్వానంద్ ఎమోషనల్‌గా ఇలా షేర్ చేసుకున్నాడు:

‘‘ఓంఐ ఒక బ్రాండ్‌ మాత్రమే కాదు, రాబోయే తరాల్ని చేరుకునే ఓ విజన్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, సృజనాత్మక మనస్సుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి వారికి ఓ గొంతుకనిస్తూ… సత్యం, సమన్వయం, మానవ అనుబంధాల్ని ప్రతిబింబించే కథలు చెబుతుంది. ఆరోగ్యం, నిలకడైన జీవన విధానాన్ని ముందుకు తెచ్చే లక్ష్యంతో పనిచేస్తుందని” పేర్కొన్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from