తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ కేవలం రెండు సినిమాలు మాత్రమే… రెండూ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్. అయినా కూడా టాప్ బ్యానర్స్, క్రేజీ హీరోలతో వరస అవకాశాలు కొట్టేసింది భాగ్యశ్రీ బోర్సే. స్క్రీన్ మీద చార్మింగ్ లుక్స్, ఫ్రెష్ వైబ్‌తో దర్శక–నిర్మాతల దృష్టి మొత్తం ఈ ముంబై బ్యూటీ మీద పడిపోయింది.

కానీ…
ఇక మిగిలేది ప్రూవ్ చేయడమే!
ఈ నెల ఆమెకి డబుల్ ఎగ్జామ్. పాస్ అయితే స్టార్ రేంజ్… ఫెయిల్ అయితే చాలా కష్టం.

టెస్ట్ 1: “కాంత” — దుల్కర్ సల్మాన్ తో పీరియడ్ డ్రామా!

బ్రిటిష్ కాలం మద్రాస్ బ్యాక్‌డ్రాప్… ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రారంభ దశల కథ…
దుల్కర్ సల్మాన్ హీరో, సముద్రకని కీలక పాత్ర, రానా–దుల్కర్ నిర్మాతలు… ఆల్రెడీ ఇన్నర్ సర్కిల్స్‌లో క్రేజ్ పెంచేసింది.

భాగ్యశ్రీ ఇందులో సినిమాల లోయల్టీ కలిగిన యాక్ట్రెస్ రోల్. స్ట్రాంగ్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ స్కోప్ భారీగా ఉందంటున్నారు. దుల్కర్ అంటే స్క్రిప్ట్ సెన్స్ గురించిన డౌటే లేదు… సో ఇక్కడ హిట్ కొట్టే ఛాన్స్ పక్కా!

రిలీజ్: నవంబర్ 14

టెస్ట్ 2: “ఆంధ్ర కింగ్ తాలూకా” — రామ్ పోతినేని బ్లాస్ట్!

సీజన్‌లో క్రేజీయెస్ట్ రిలీజ్‌లలో ఒకటి.
రామ్ పోతినేని ఎనర్జీకి పక్కాగా సూటయ్యే మాస్–యాక్షన్ మెటా స్టోరీ. ఉపేంద్ర కూడా కీలక రోల్… రామ్ సూపర్‌స్టార్ ఫ్యాన్‌గా కనిపించే కాన్సెప్ట్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది.

క్యాచీ సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్, భారీ ప్రమోషన్స్ already హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో భాగ్యశ్రీ రామ్ లవ్ ఇంటరెస్ట్‌గా కనిపించబోతుంది.

ఇక ఫలితం?

ఈ రెండు సినిమాల్లో ఒకటైనా హిట్ అయితే…
భాగ్యశ్రీ బోర్సే – నెక్ట్స్ సౌత్ క్రేజ్ బ్యూటీ!

లేదంటే…
ఇండస్ట్రీలో ఉన్న “లక్కీ చాన్స్” ట్యాగ్ కోల్పోయే ప్రమాదం.

చూద్దాం… ఈ నవంబర్ రియల్లీ ఆమె లైఫ్ మార్చేస్తుందా?

సౌత్ సినీ ప్రేక్షకులు, ట్రెండ్ వాచర్స్ అందరి కళ్ళూ ఇప్పుడు భాగ్యశ్రీ మీదే!

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com