మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’.ఇది తమిళ సినిమా ‘గరుడన్’కి రీమేక్. ట‍్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు.

గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎ‍ట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ రూ.32 కోట్ల భారీ ధరకు స్వాధీనం చేసుకుంది. ఇది ఈ స్థాయిలో ఓ రీమేక్ చిత్రానికి వచ్చిన అరుదైన రికార్డు డీల్. సినిమా ట్రైలర్ చూసిన వెంటనే జీ స్టూడియోస్ ప్రతినిధులు ఈ డీల్‌కు ముందుకొచ్చినట్లు సమాచారం.

బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిందీలో మంచి మార్కెట్ ఉండటమే ఈ భారీ ఒప్పందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ క్రేజీ డీల్ ద్వారా నిర్మాతలు తమ పెట్టుబడి రికవర్ చేసుకుంటారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు.

మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.

, , ,
You may also like
Latest Posts from