పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే, ఈ క్రేజ్‌ను మరింత పెంచేందుకు అవసరమైన ప్రమోషన్లలో మాత్రం టీమ్ కొంత వెనుకబడుతోంది.

ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ గురించి ఓ పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. తొలుత ఈ గ్రాండ్ ఈవెంట్‌ను జూలై 20న విశాఖపట్నంలో నిర్వహించాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఈ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకున్నాయని సమాచారం.

విశాఖ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌?

ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, హరి హర వీరమల్లు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకి మారినట్టు టాక్ వినిపిస్తోంది.

అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదే కానీ, ఈ వేడుక జూలై 21న జరుగనుందని ఇండస్ట్రీలో గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు… ట్రేడ్ వర్గాలు కూడా ఈ ఈవెంట్ ద్వారా సినిమా బజ్ మళ్లీ ఊపందుకోవాలని ఆశిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’కి ఇది మరింత పాజిటివ్ ఇంపాక్ట్‌ ఇవ్వాలని హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.

మరి ఈ ఈవెంట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి!

, , , , , , , ,
You may also like
Latest Posts from