పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ “OG” రిలీజ్ ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే డే 1 ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ హవా కొనసాగుతుండగా, ఇప్పుడు ఓటీటీ డీల్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

OG డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది – అదికూడా అన్ని భాషల్లో కలిపి 80 కోట్లకు పైగా చెల్లించి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ ఒక భారీ డీల్‌గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా మేకర్స్ 4 వారాల థియేట్రికల్ విండో కండిషన్ పెట్టడంతో, హిందీ మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా రాబోతోందన్న ప్లాన్లు డ్రాప్ అయినట్టు సమాచారం.

శాటిలైట్ రైట్స్ మాత్రం స్టార్ మా దక్కించుకుంది. అంటే రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సినిమా పెద్ద మొత్తాన్ని కొల్లగొట్టింది.

ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ పీక్స్‌లో..!

చివరిగా వచ్చిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించడంతో, పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మొత్తం ఫోకస్ “OG” పై పెట్టారు. మరో నాలుగు రోజుల్లోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం, మేకర్స్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో ప్రీమియర్‌లు ఉండబోతున్నాయి.

భారీ బడ్జెట్ – భారీ అంచనాలు

250 కోట్ల భారీ బడ్జెట్‌తో DVV ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా అలరించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, ఉపేంద్ర లిమయే, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది.

సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న “OG” పై ట్రేడ్ నిపుణులు భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయనే అంచనాలు వేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from