బాలీవుడ్ అంటేనే డాన్స్ ,మసాలా. అక్కడ ఎదుగుల సామాన్యమైనది కాదు. అయితే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ నుంచి స్టార్ అవటం మరీ కష్టం. కానీ కొందరు అవి సాధించారు. అయితే అవి ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ కాదు, ఏళ్ల తరబడి తమ అందం,గ్లామర్ పెట్టుబడిగా పెట్టి డాన్స్ లో కొత్త స్టెప్స్ ని వేస్తూ పై నుంచి క్రింద దాకా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే అక్కడ స్దానం. అలా రీసెంట్ గా బ్యాక్‌గ్రౌండ్ నుండి పెద్ద స్దాయికి ఎదిగిన బాలీవుడ్ సెలబ్రిటీలను ఇక్కడ చూడండి!
నోరా ఫతేహి – స్టేజి షోల నుంచి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా
బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ నుండి బాలీవుడ్ సంచలనం వరకు నోరా ఫతేహి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఆమె పరిశ్రమలో దూసుకుపోవటానికి ముందు అనేక స్టేజ్ షోలు మరియు డాన్స్ టీమ్ లలో ప్రదర్శన ఇచ్చింది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నిశ్చయించుకున్న ఆమె తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కష్టపడి పనిచేసి బయటి వ్యక్తులకు అవకాశాలు తక్కువగా ఉన్న పరిశ్రమలో హద్దులు దాటింది. వివిధ డాన్స్ స్టైల్స్, ఆత్మవిశ్వాసం ఆమెను ఈ రోజు ఈ స్దాయికి తెచ్చాయి.

డైసీ షా – కోరస్ లైన్ నుండి సెంటర్ స్టేజ్ దాకా
డైసీ షా అంటే ఇవాళ బాలీవుడ్ లో పెద్ద స్టార్ డాన్సర్. ఆమె కొరియోగ్రఫీ స్టార్స్ వెనుక నుండి వారితో స్క్రీన్ స్పేస్ పంచుకునే వరకు వెళ్ళింది. పరిశ్రమలోని ప్రముఖులచే గుర్తించబడకముందు ఆమె బ్యాక్ గ్రౌండ్ డాన్సర్. తన కళ పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్ధతే ఆమెను ఈ స్దాయికి తీసుకు రావటంలో సహాయపడింది. అతి తక్కువ టైమ్ లోనే ఆమె సైడ్ డాన్సర్ నుంచి సెంటర్ స్టేజ్ దాకా వచ్చింది. తన ఆకట్టుకునే నటనతో, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో బాలీవుడ్‌లో స్థానం సంపాదించుకుంది. సహనం, పట్టుదల దీర్ఘకాలంలో ప్రతిఫలాన్ని ఇస్తాయని నిరూపిస్తూ నేడు ఆమె వెలుగుతూనే ఉంది.

కాజల్ అగర్వాల్ – బ్లాక్‌బస్టర్స్‌కి కేరాఫ్ ఎడ్రస్
మన తెలుగు,తమిళ సినిమాని జయించి, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు, కాజల్ అగర్వాల్ కెరీర్ ప్రారంభ ప్రాజెక్ట్‌లలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ గా చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె డాన్సర్ అయినా మంచి ఫెరఫార్మర్ . ఆమె ప్రతిభ, పట్టుదల , అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అతి త్వరలోనే ఆమెకు ప్రధాన పాత్రలను అందించాయి. ఆమె పరిశ్రమలో ఓ టైమ్ లో మంచి స్దాయికి చేరింది. ఈ రోజు, ఆమె స్టార్ హీరోయిన్స్ లలో ఒకరు.
