సినిమా వార్తలుసినిమా సమీక్షలు

చిరు ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ రివ్యూ

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి)… మరోవైపు పెద్ద బిజినెస్‌ను నడిపించే శశిరేఖ (నయనతార). ఒకప్పుడు భార్యాభర్తలైన వీళ్లిద్దరూ పది ఏళ్ల క్రితమే విడిపోయారు. పిల్లలు నిక్కీ, విక్కీలను కూడా ప్రసాద్‌కు దూరం చేసింది శశిరేఖ. తండ్రిపై పిల్లలకు చెడ్డ అభిప్రాయం కలిగేలా చేయడం ప్రసాద్‌ను మరింత బాధపెడుతుంది.

తన పిల్లలకు దగ్గరవ్వాలనే ఒక్క కారణంతో ప్రసాద్ ఒక అనుకోని నిర్ణయం తీసుకుంటాడు. వాళ్లు చదువుకునే స్కూల్‌లోనే పీటీ సార్‌గా చేరతాడు. తక్కువ సమయంలోనే పిల్లలకి దగ్గర అవుతాడు. “ఇలాంటి నాన్న మనకూ ఉంటే బాగుండేది” అనుకునే స్థాయికి తీసుకెళ్తాడు. పిల్లల కోసమైనా శశిరేఖకి మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు.

కానీ ఈ ప్రయత్నాన్ని శశిరేఖ అడ్డుకుంటుంది. అప్పుడు ప్రసాద్ మరో మార్గం ఎంచుకుంటాడు—శశిరేఖ తండ్రి జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్) ఇంట్లోకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా తన టీమ్‌తో అడుగుపెడతాడు. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన వీరేంద్ర పాండా (సుదేవ్ నాయర్) రంగంలోకి వస్తాడు. అతని లక్ష్యం ఒక్కటే—శశిరేఖను, ఆమె పిల్లలను హానిచేయడం.ఇప్పుడు ప్రసాద్ ఏం చేస్తాడు… అసలు ప్రసాద్–శశిరేఖ ఎందుకు విడిపోయారు? వీరేంద్ర పాండా ఎందుకు శశిరేఖపై పగ పెంచుకున్నాడు? ఈ మొత్తం కథలో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే… ‘మ‌న శంకర వర ప్రసాద్ గారు’ చూడాల్సిందే!

విశ్లేషణ

మామూలుగా అనిల్ రావిపూడి సినిమా అంటే ఒక ఫార్ములా. మన శంకర వర ప్రసాద్ గారు కూడా అదే ట్రాక్‌లోనే మొదలవుతుంది. హీరో ఎస్టాబ్లిష్‌మెంట్,స్టోరీ వరల్డ్ , కామెడీ టోన్—అన్నీ అతని పాత సినిమాల్ని గుర్తు చేస్తాయి. కానీ ఇక్కడ కీలకమైన మార్పు ఒక్కటే: చిరంజీవి. ఈ సినిమా స్క్రిప్ట్ ఫోకస్ కథ మీద ఉండదు… చిరంజీవి బాడీ లాంగ్వేజ్, విన్టేజ్ టైమింగ్ మీద ఉంటుంది.

దాంతో ప్రారంభంలో చిరంజీవి టోన్, అనిల్ ప్రపంచానికి సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ భాగాలు కొంచెం లాగ్ అనిపిస్తాయి. కానీ ఒకసారి టోన్ సెటిల్ అయ్యాక, కథ వెనక్కి తిరగదు. పెద్ద “బిగ్-బ్యాంగ్” కామెడీ బ్లాక్ లేకపోవడం మైనస్ అయినా, న్యారేటివ్ ఎక్కడా డౌన్ అవ్వదు. గ్యాగ్స్ స్మూత్‌గా వస్తుంటాయి.

కథ సింపుల్. ముందే ఎటు వెళ్లబోతుందో అర్థమవుతుంది. అయినా కూడా ఎంటర్టైన్‌మెంట్ ఆగకుండా న్యారేటివ్‌లో కలపడం అనిల్ బలం. ఇంటర్వెల్ బ్లాక్ ప్రెడిక్టబుల్ అయినా, మినిమమ్ కాన్ఫ్లిక్ట్‌తో “తర్వాత ఏమవుతుంది?” అన్న ఆసక్తిని నిలబెడుతుంది.

ఇంటర్వెల్ తర్వాత కూడా అదే ఫార్మాట్. కామెడీకి ప్రాధాన్యం, కథకి రెండో స్థానం. అయితే ఇక్కడే మొదటి హాఫ్‌తో పోల్చితే కన్సిస్టెన్సీ తగ్గుతుంది. ఈసారి దర్శకుడి కంటే, నటుడే సినిమా మోస్తున్నట్టు అనిపిస్తుంది.

‘మీసాల పిల్ల’, అత్త–అల్లుడి సంభాషణ లాంటి కొన్ని భాగాలు ఓకే. కానీ సినిమా నిడివికి తగినంత గ్యాగ్స్ నిలబడవు. ఇక్కడే వెంకటేష్ ఎంట్రీ—కథలోకి “మసాలా” చేరుతుంది. చిరంజీవి–వెంకటేష్ కలయిక చూడటానికి బాగుంది. కెమిస్ట్రీ కూడా వర్క్ అవుతుంది. కానీ వాళ్లకు దొరికిన కంటెంట్ పాస్‌బుల్ మాత్రమే… మెమరబుల్ కాదు. స్టార్ పవర్ కథను ప్రెడిక్టబిలిటీ సముద్రంలో తేలిపోకుండా కాపాడుతుంది, అంతే.

క్లైమాక్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌లోనే ముగుస్తుంది. ఆశ్చర్యం లేదు, కొత్తదనం లేదు. కానీ కథను క్లోజ్ చేయడానికి అవసరమైనంత మాత్రం చేస్తుంది.

అసలు మిస్ అయినది ఇదేనా?

ఈ సినిమా “జస్ట్ పాస్‌బుల్ ఎంటర్టైనర్” దగ్గరే ఆగిపోవడానికి అసలు కారణం—ఎమోషన్‌ను చాలా లైట్‌గా హ్యాండిల్ చేయడం. నయనతార ఒకసారి వెంకటేష్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పి, వెంటనే అభిప్రాయం మార్చడం… పిల్లలతో ఎమోషన్ ట్రిగ్గర్ చేయాలనే ప్రయత్నం ఉన్నా, అది మెలోడ్రామాగా మాత్రమే మిగులుతుంది, లోతుగా ఎక్స్‌ప్లోర్ చేయబడదు. ఇక్కడే సినిమాకు ఉన్న పెద్ద అవకాశాన్ని అనిల్ వదిలేశాడు.

టెక్నికల్ గా…

సంగీతం బీమ్స్ సిసిరోలియో అందించారు. పాటలు బాగానే ఉన్నాయి కానీ వెంటనే హిట్ అయ్యే చార్ట్‌బస్టర్ మాత్రం లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది, సినిమా మొత్తం విజువల్స్ డీసెంట్‌గా కనిపిస్తాయి. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ లాంటి సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు సరిపోయేలా ఉన్నాయి.

నటీనటులు విషయానికి వస్తే..

ఈ సినిమా పూర్తిగా చిరంజీవి మీదే నడుస్తుంది. పెద్ద హంగులు లేకుండా, కంట్రోల్‌డ్‌గా ఆయన చేసిన నటన బాగా వర్క్ అవుతుంది. ఇది ఆయన కంబ్యాక్ తర్వాత కనిపించిన బెస్ట్ వెర్షన్ అనిపిస్తుంది. నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, స్క్రీన్ టైమ్ తక్కువైనా తన ప్రభావం చూపిస్తుంది. వెంకటేష్ చిన్న పాత్రలో సహజంగా కనిపించి, సింపుల్‌గా పని పూర్తిచేస్తాడు.

ఇక కేథరిన్ ట్రెసా, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ లాంటి పరిచయమైన సపోర్టింగ్ నటులు కనిపిస్తారు. వాళ్లు తమ పని బాగానే చేస్తారు కానీ, వాళ్ల నుంచి ఆశించిన స్థాయి కామెడీ మాత్రం పెద్దగా రావడం లేదు.

సచిన్ ఖేడ్కర్ ఎప్పటిలాగే నీట్‌గా నటించారు, పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతారు. శరత్ సక్సేనా కూడా తన పాత్రలో బాగానే ఇమిడిపోయారు. చిన్న నటుడు రేవంత్ (బుల్లిరాజు)కు ఈ సినిమాలో పెద్దగా మెరుపులు మెరిపించే అవకాశం దక్కలేదు.

చూడచ్చా?

హార్డ్‌కోర్ చిరంజీవి అభిమానులకు ఇది ట్రీట్. సాధారణ ప్రేక్షకులకు ఇది హార్మ్‌లెస్, పాస్‌బుల్, వన్‌టైమ్ వాచ్

ఫైనల్ గా …

ఈ కథలో అన్నీ ఉన్నాయి—స్టార్, ఫ్యామిలీ డ్రామా, పిల్లల ఎమోషన్, రొమాన్స్, కామెడీ. ఇది నిజంగా అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అనిల్ రావిపూడి కేవలం కొన్ని గ్యాగ్స్‌పైనే ఫోకస్ చేశాడు. ఫెస్టివల్-ఫ్రెండ్లీ లైట్ టోన్‌ని ఎంచుకున్నాడు. పూర్తి ఎమోషనల్ రియలైజేషన్‌కు వెళ్లలేదు. ఫస్ట్ హాఫ్ బేస్ వేసింది… కానీ సెకండ్ హాఫ్ ఆ బేస్‌పై గట్టిగా కట్టలేదు.

Similar Posts