మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో తన పరుగును ముగించుకుంది. ఫైనల్‌గా ఈ మూవీ ఎంత వసూలు చేసిందో వివరాల్లోకి వెళ్తే..
రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’
చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సంక్రాంతి పండగ వేళ విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జనం బండ్లు, ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్లకు తరలివచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసేలా సినిమా ఉండటంతో, రీజినల్ ఫిల్మ్ కేటగిరీలో ఇది పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది.
మొదటి రోజే భారీ వసూళ్లు
నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ ఒక స్పెషల్ రోల్‌లో మెరిశారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఓపెనింగ్స్ విషయంలో చిరంజీవి తన సత్తా చాటారు. మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్లు వసూలు చేసి, సీనియర్ హీరోలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా చిరు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కూడా వసూళ్ల వేట ఏమాత్రం తగ్గలేదు.
క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు
దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ సినిమా, 50 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ సమయంలో రోజుకు రూ. 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేసేది. 50 రోజుల తర్వాత వసూళ్లు నెమ్మదించి, రోజుకు లక్ష రూపాయలకే పరిమితమైంది. మొత్తంగా 57 రోజుల రన్ తర్వాత, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 304 నుండి 305 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ప్రముఖ బాక్సాఫీస్ సైట్లు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ వసూళ్లు రూ. 220 కోట్లు కాగా, ఓవర్సీస్ నుండి రూ. 43 కోట్లు వచ్చాయి. ఈ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లకు పైగానే షేర్ వచ్చినట్లు సమాచారం.
లాభం ఎంతంటే?
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 120 కోట్లకు జరిగింది. బాక్సాఫీస్ వసూళ్లను బట్టి చూస్తే, నిర్మాతలకు సుమారు రూ. 70 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ మొదటి వారంలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన ముగియడంతో, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే దీనిని వీక్షించవచ్చు.

