ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా రాబిన్ హుడ్ లో ఉన్నాడని అందరికీ తెలిసిందే. ఆ నేపధ్యంలో అనేక పలు పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. తాజాగా మేకర్స్ ఫైనల్ గా వార్నర్ ని ఇండియన్ సినిమాకి అలాగే తెలుగు సినిమాకి పరిచయం చేస్తూ తన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వార్నర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ కలర్ ఆరెంజ్ రంగులో డిజైన్ చేయడం గమనార్హం. ఇక ఇందులో వార్నర్ మంచి డైనమిక్ గా కూడా కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమాతో తనపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో వార్నర్ పోషించే పాత్ర ఏమిటనే డిస్కషన్ మొదలైంది.

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. మరి ఎప్పుడు నుంచో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఎట్టకేలకి ఈ మార్చ్ లో మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తెలుగులోకి కూడా నటించిన సంగతి తెలిసిందే.

చాలా మంది ఆయన పాత్ర ఎంటర్టైనింగ్ గా కామెడీ రోల్ లా ఉంటుంది అనుకుంటున్నారు కానీ తన రోల్ మాత్రం ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

దర్శకుడు సహా నిర్మాణ సంస్థ కూడా వార్నర్ ని ‘భాయ్’ అంటూ సోషల్ మీడియాలో పిలుస్తున్నారు.

కాబట్టి తాను ఒక డాన్ లానో లేక మాఫియా గ్యాంగ్ స్టర్ లో కనిపిస్తారా అనేది మంచి ఆసక్తిగా మారింది. ఇక మొత్తానికి అయితే వార్నర్ రోల్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా ట్రైలర్ లేదా మార్చ్ 28 రిలీజ్ వరకు ఆగాల్సిందే.

, , ,
You may also like
Latest Posts from