

బాలీవుడ్లో పీఆర్ గేమ్ మీద తన కోపాన్ని వెల్లగక్కిన మనోజ్ బాజ్పేయీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అదే సమయంలో ఆయన రష్మిక పైన సెటైర్స్ వేసారని అంటున్నారు. అయితే ఆయన మాటల్లో ఎక్కడా రష్మిక పేరు ప్రస్తావించలేదు. కానీ ఇండైరక్ట్ గా ఆ కామెంట్స్ రష్మికను ఉద్దేశించినట్లే అనిపిస్తున్నాయి. ఇంతకీ మనోజ్ బాజ్ పేయ్ ఏమన్నారు..
“ఒక సినిమాలో బాగా నటించానని నేను అనుకునే సరికి… పీఆర్ టీమ్ వేరే వాళ్లను ‘బెస్ట్ యాక్టర్’ అని ఎత్తి చూపుతుంది. నిజంగా కష్టపడే నటుల కృషికి విలువ లేకుండా పోతుంది. ఇది అవమానం” అని ఆయన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
మనోజ్ మాట్లాడుతూ…‘‘పియూశ్ మిశ్రా లాంటి గొప్ప నటులు ఎన్నో రోజులు శిక్షణ తీసుకొని ఈ రంగంలోకి వచ్చారు. కొన్నేళ్ల నుంచి అలరిస్తున్నారు. అతని తర్వాత వచ్చిన వారిని ఉత్తమ నటులు అంటూ పోస్ట్ పెట్టి హైలైట్ చేయడమంటే పియూశ్ను అవమానించడమే అవుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాత్రికి రాత్రే ఉత్తమ నటుడు, నేషనల్ క్రష్ (National Crush) అనే ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి. ఏదైనా మంచి సినిమాలో గొప్పగా నటించాను అనుకునేసరికి పీఆర్ టీమ్ వేరే నటుడిని హైలైట్ చేస్తుంది. దీంతో వారు గుర్తింపు పొందుతున్నారు. ఈ సంస్కృతి చాలా చిరాకు తెప్పిస్తోంది’’ అని అన్నారు.
నేషనల్ క్రష్ ట్యాగ్ పై ఫైర్
ఈ క్రమంలో “రాత్రికి రాత్రే ‘బెస్ట్ యాక్టర్’ , ‘నేషనల్ క్రష్’ అన్న ట్యాగ్లు క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో కొత్త అలజడి. ఇలాంటివి చూసి చిరాకొస్తోంది” అని అనటం వైరల్ అవుతోంది.
కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయన ‘నేషనల్ క్రష్’ అని ప్రస్తావించగానే నెట్టింట చర్చ రష్మిక వైపు మళ్లింది. “మనోజ్ కామెంట్స్ డైరెక్ట్‌గా రష్మిక ని ఉద్దేశించేనా?” అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం — “ఆయన ఎవరి పేరూ చెప్పలేదు, కేవలం ట్రెండింగ్ ట్యాగ్ల గురించి మాట్లాడారు” అని క్లారిటీ ఇస్తున్నారు.
ప్రస్తుతం మనోజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, ఆయన నటించిన ‘ఇన్స్పెక్టర్ జెండె’ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తానికి… బాజ్పేయీ మాటలు నిజంగానే రష్మికపైన సెటైర్ వేసినట్టా? లేక కేవలం ట్యాగ్ల ట్రెండ్‌పై ఫైర్ అయ్యారా? అన్నది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ డిబేట్!