
పైరసీ కింగ్‌కు పోలీస్ ఉద్యోగం? ఐ బొమ్మ రవికి వచ్చిన బంపర్ ఆఫర్ నిజమా?
ఒకప్పుడు పోలీసులకే కనిపించకుండా డజన్ల దేశాల్లో IP లు మార్చుకుంటూ తిరిగిన వ్యక్తి… అనుకోకుండా కుకట్పల్లి ఫ్లాట్‌లో అరెస్టైపోయాడు.
ఈ అరెస్టుతో— “ఐ బొమ్మ రవి ఎవరు?”, “ఎలా ఇంత భారీ నెట్వర్క్ నడిపాడు?” అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి.
ఒకవైపు ప్రజలు అతనిని “సినిమాల రాబిన్ హుడ్” గా చూస్తుంటే… మరోవైపు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అతడిని “సైబర్ క్రైమ్ సామ్రాట్” అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి వ్యక్తికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారట అన్న వార్తలు రావడంతో మరోసారి రవి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
రవి ప్రత్యేకత— టెక్నాలజీ మీద అద్భుత పట్టు. IP లొకేషన్లు మార్చడం, విదేశీ సర్వర్లు వాడటం, ఎన్క్రిప్టెడ్ నెట్‌వర్క్‌తో పైరసీ రన్ చేయడం…
ఇవన్నీ సాధారణ వ్యక్తి చేయలేని పనులు. కానీ ఆ ప్రతిభను చట్టవిరుద్ధంగా ఉపయోగించడమే అతని దారుణమైన పొరపాటు. ఇదే సమయంలో కొన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలు ఒక సెన్సేషనల్ కథనం ప్రచురించాయి— “పోలీసులు ఐ బొమ్మ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చారు!”
పోలీసుల ఆఫర్ ఏమిటి?
వార్తల ప్రకారం— సైబర్ క్రైమ్‌లో రవికి ఉన్న టాలెంట్ చూసి, అతడిని సైబర్ క్రైమ్ విభాగంలోనే ఉద్యోగం ఆఫర్ చేశారట. “ప్రభుత్వంలో పని చేస్తే మంచి జీతం, లీగల్ ఫ్యూచర్… నీకు ఉపయోగం” అని పోలీసులు చెప్పారట.
ఈ కథనాల ప్రకారం, రవి ఆ ఆఫర్‌ని తిరస్కరించాడట.
కరీబియన్ డ్రీమ్: రవి ప్లాన్ ఏమిటో తెలుసా?
విచారణలో రవి అధికారులకు చెప్పినట్టు చెబుతున్న కథనం— “కరీబియన్ దీవుల్లో ‘I-Bomma Restaurant’ పెట్టి ఆంధ్రా, తెలంగాణ వంటకాలతో ప్రజలను ఆకట్టుకుంటాను. అదే డబ్బుతో జీవితాంతం ప్రశాంతంగా ఉంటాను” అని రవి అన్నాడట.
నెటిజన్ల రియాక్షన్—సపోర్ట్ vs వ్యతిరేకం
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
సపోర్ట్ వర్గం:
“రవి టాలెంట్ వృథా కాకుండా పోలీస్ ఉద్యోగం ఇచ్చారంటే మంచిదే” అన్నారు.
వ్యతిరేక వర్గం:
“నేరం చేసి పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా?
ఇలా ఎంకరేజ్ చేస్తే సైబర్ నేరాలకు బ్రేక్ ఎక్కడ?”
అని తీవ్రంగా విమర్శించారు.
“దొరికినా దొరే… దొరక్కపోయినా దొరే” అనే మైండ్‌సెట్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరించారు.
ఏదైమైనా
ఐ బొమ్మ రవికి పోలీసులు నిజంగానే బంపర్ ఆఫర్ ఇచ్చారా?
అది వాస్తవమా? లేక మీడియా కలిపిన పులిహార వార్తా?
ఈ విషయం పై ఇంకా అధికారిక స్పష్టత రానప్పటికీ— ఒక సైబర్ నేరగాడి ప్రతిభ, అతని తీరు, అతని నిర్ణయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో భారీ చర్చకే కారణం అవుతున్నాయి.
ఐ బొమ్మ రవి కథ— ముగిసిన Chapter కాదు… మరో కొత్త మలుపులోకి వెళ్లిన Chapter!
