తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినిమాలను పైరసీని అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే అవి పైరసీకి గురై నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలి అని అన్నారు. ఈ విషయంలో నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను పైరసీ భూతం పీడిస్తోందని తెలిపారు.
పైరసీని అరికట్టేందుకు FDC చైర్మన్‌గా తాను ఉద్యమాన్ని లీడ్ చేస్తానని చెప్పారు. దీనికోసం నిర్మాతలు అంతా కలిసి రావాలి.. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉన్నవారు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్మాత దిల్ రాజ్ పిలుపునిచ్చారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 2013లో విడుదలైంది. అయితే, సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ మూవీ మార్చి 7న రీరిలీజ్ కానున్నడంతో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల కథతో పాటు దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.
వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా కావడంతో అప్పుట్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ ట్రెండ్‌కు ఈ మూవీ కొత్త ఊపిరిపోసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో సీతగా అంజలి పాత్ర ప్రధానం.