హైదరాబాద్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఎప్పుడు చూసినా హిట్ల పరంపరతో వెలుగులో ఉండే ఆయనకు, కరోనా తర్వాత కాలం మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తప్ప మరే సినిమాతోనూ ఆయన బేనర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మంచి ఫలితాన్ని అందుకోలేదు.

ఈ నేపథ్యంలో దిల్ రాజు ఒక్క మెట్టు వెనక్కి వెళ్లి, తన ప్రొడక్షన్ దిశను పూర్తిగా మార్చేశారట. తాత్కాలికంగా పెద్ద సినిమాల హడావుడి నుంచి బ్రేక్ తీసుకుంటూ, మళ్లీ తన పాతదారి… కంటెంట్‌తో ఆకట్టుకునే సినిమాల వైపు మళ్లారు.

ఇప్పటికే ఆయన ఓ టాలెంట్ హంట్ నిర్వహించి, కొత్త రైటర్లు, డైరెక్టర్లు కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గత కొన్ని వారాలుగా విస్తృతంగా స్క్రిప్ట్‌లు వింటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు అమెరికాలో ఉండగా, అక్కడే యువ దర్శకులు, ప్రొడ్యూసర్లతో వరుసగా మీటింగ్స్ ప్లాన్‌ చేసుకున్నారు.

ఈ ప్రయాణంలో ఆయన ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రతి ఏడాది నాలుగు చిన్న, మిడియం రేంజ్ సినిమాలు రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్ట్స్‌గా ఉండనున్నాయి.

ఇక పెద్ద స్టార్స్‌తో, హై బడ్జెట్ సినిమాలు మాత్రం మునుపటిలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైనే కొనసాగిస్తారట.

2026లో మూడు సినిమాలు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వరకు ఆయన ప్లానింగ్ పక్కాగా కొనసాగుతోందట!

, , ,
You may also like
Latest Posts from