తమిళ దర్శకుడు శంకర్ ఓ టైమ్ లో మామూలుగా వెలగలేదు. తెలుగు,తమిళ స్టార్ హీరోల్లో చాలా మంది ఆయనతో చేయాలని ఉత్సాహం చూపించేవారు. అందుకోసం ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వటానికైనా సిద్దపడవారు. శంకర్ సినిమా కోసం డేట్స్ ఖాళీ పెట్టుకుని వెయిట్ చేసేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. శంకర్ తన నెక్ట్స్ సినిమా కోసం స్క్రిప్టు పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతున్నారు.

తమిళ మీడియాలో విన్పిస్తున్న వార్తల ప్రకారం, శంకర్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో కలిసి నెక్స్ట్ సినిమా చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పటిదాకా శంకర్ ఇంకా అజిత్ ని కలవలేదు. కలికే అవకాసం రాలేదు. అంటే అజిత్ ప్రక్కన పెట్టాడని కాదు. అజిత్ ఇప్పుడు స్పెయిన్ లో రేసింగ్ పోటీలో పాల్గొంటున్నారు. ఆ వచ్చాక కథ వినాలి, ఆ తర్వాత శంకర్ కి అజిత్ అవకాశం ఇస్తారా లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఇప్పుడు శంకర్ సిట్యువేషన్ గతంలోలా లేదు. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ల సందర్భంగా శంకర్ తన తదుపరి చిత్రం ‘వేల్పారి’ నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించాడు. కానీ అంత బడ్జెట్ సినిమా ఇప్పుడు ఉంటుందా , ఉండదా అనే సందేహం వస్తోంది.

మరో ప్రక్క ‘ఇండియన్ 3’ విడుదల చేయాల్సిన బాధ్యత కూడా శంకర్ మీద ఉంది. ఇవన్ని ఎప్పటికి తెమిలోనో, శంకర్ పరిస్దితి మరీ ఇలా అయ్యిపోయిందేంటి అంటున్నారు. అదీ మ్యాటర్.

You may also like
Latest Posts from