ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటినప్పటికీ దిశా పటానీకి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో ‘లోఫర్’ అనే సాధారణ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా, బాలీవుడ్‌లో మాత్రం బిగ్ బ్రేక్‌ను అందుకోవడమే కాకుండా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమా ఫెయిలైనా, ధైర్యాన్ని కోల్పోకుండా ‘ఎంఎస్ ధోనీ’లో చేసిన చిన్న పాత్రతోనే నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. అందానికీ, ఫిట్‌నెస్‌కీ, స్టైల్‌కి ఈ ముద్దుగుమ్మ మరోపేరై మారింది.
బాఘీ వంటి కమర్షియల్ హిట్స్ ద్వారా హిందీ మార్కెట్లో దిశా స్థానం బలపడింది. గత ఏడాది వచ్చిన ‘యోధ’, ‘కల్కి 2898 ఏ.డి’, ‘కంగువా’ సినిమాల వల్ల సౌత్ ఆడియన్స్ లో కూడా ఆమెకి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే కల్కిలో పాత్ర చిన్నదిగా మిగిలిపోవడం, కంగువా డిజాస్టర్ కావడంతో దిశా ఆశించినంతగా రాబట్టలేకపోయినా – ఆమె స్పిరిట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దిశా పటానీ షేర్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ వీడియోలకి ఆల్టర్నేటివ్‌గా “డాన్స్ విత్ ఎఫోర్ట్‌లెస్ ఎలిగెన్స్” అంటూ జిమ్ డ్రెస్‌లో చేసిన స్పెషల్ చైర్ డాన్స్ మువ్‌లతో ఫాలోవర్స్ గుండెల్లో సెగలు రేపింది. స్పోర్ట్స్ బ్రా, మినీ షార్ట్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వయ్యారంగా స్టెప్పులేసిన ఈ డ్యాన్స్ వీడియోకు కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్, వేలల్లో షేర్‌లు వచ్చాయి.\
“ఇలాంటి స్టైల్‌లో డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం” అని స్వయంగా కామెంట్ చేసిన దిశా — తన ఫిట్‌నెస్, గ్రేస్‌తో మళ్లీ ఒకసారి నెటిజన్స్‌ని మాయ చేసింది.
ఫ్లాపులు, క్రిటిసిజం ఏవైనా సరే – దిశా స్టైల్ మాత్రం ఎప్పుడూ ఓ లెవెల్లో ఉంటుంది. కెరీర్‌గా రెగ్యులర్‌గా స్క్రిప్ట్‌లు వింటూనే, సోషల్ మీడియాలో విభిన్న కాన్సెప్టులతో ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉండే ఈ బ్యూటీకి “లైమ్ లైట్ ఎలా పట్టుకోవాలో” బాగా తెలుసనేది మాత్రం స్పష్టమవుతోంది.