అప్పుడప్పుడూ బంగారాన్ని రకరకాల మార్గాల్లో దాచి స్మగ్లింగ్ చేయటం సినిమాల్లో చూస్తూంటాం. అయితే అవి చాలా సార్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవే అని కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు అర్దమవుతుంది. ఇప్పుడు కర్ణాటక లో సంచలనం సృష్టిస్తున్న నటి స్మగ్నింగ్ వ్యవహారం ఇలాంటిదే. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యా రావు. కి బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా రాకెట్‌ బయటపడొచ్చని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు.

రన్యా రావు అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేష్‌. సినీ రంగంలో రాణించవచ్చన్న నమ్మకంతో రన్యా రావుగా పేరు మార్చుకుంది. తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటంతో డీఆర్‌ఐ అధికారులు ఆమెపై దృష్టిసారించారు. గత 15 రోజుల్లో 4సార్లు వెళ్లి వచ్చిందని రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి ఆమె దుబాయ్‌ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొంది.

రామచంద్రరావు హోదా అడ్డుపెట్టుకొని ఓ కానిస్టేబుల్‌ సాయంతో రెండు, మూడు తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చారు. చివరి ద్వారం వద్ద మాత్రం డీఆర్‌ఐ అధికారులు నిలువరించి, సోదాలు చేశారు. దీంతో బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది.

తొడలకు జిగురు రాసుకొని 14 బంగారు బిస్కెట్లను అంటించుకొని, దానిపై టేపు, మరో వరస క్రేప్‌ బ్యాండేజ్‌ వేసుకోవడాన్ని అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్‌కి తరలిస్తే.. దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రామచంద్రరావుకు అత్యంత సన్నిహిత బంధువు రన్యా రావు. ఐపీఎస్‌ అయిన బంధువు హోదా ఉపయోగించుకొనే విమానాశ్రయం నుంచి బయటకొచ్చాక పోలీసు ఎస్కార్ట్‌తోనే ఇంటికి వెళ్లేదని తెలిసింది.

You may also like
Latest Posts from