
రిలీజ్‌కి ముందు నుంచే “డ్యూడ్” చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటాయి. “లవ్ టుడే”తో పాన్-ఇండియా యూత్ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ —ఈసారి మరింత సీరియస్, బోల్డ్ సబ్జెక్ట్‌తో వచ్చాడు. ప్రేమ, కులం, పరువు అనే ట్యాబూ టాపిక్స్‌పై హిట్ సినిమాను తీయగలడా? అన్న ప్రశ్న అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే రిలీజ్‌కి వచ్చిన తర్వాత… “డ్యూడ్” నిజంగానే టాక్ ఆఫ్ ది టౌన్!
4 రోజులలోనే డ్యూడ్ దుమ్ము రేపింది!
రిలీజ్ అయిన మొదటి నాలుగు రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి. దీపావళి రోజున తమిళనాడులో సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్. డే–4కి “డ్యూడ్” తన బిగ్గెస్ట్ డేని నమోదు చేసుకుంది. తమిళనాడులోనే డబుల్ డిజిట్ గ్రాస్ సాధించడం రేర్ ఫీట్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్స్ – రికార్డ్ బ్రేకింగ్ రన్!
తమిళనాడు: ₹33 కోట్లు (4 రోజుల్లోనే)
తెలుగు రాష్ట్రాలు: ₹11.5 కోట్లు
ROI (మిగతా భారత రాష్ట్రాలు): ₹6 కోట్లు
ఇండియా గ్రాస్ మొత్తం: ₹50 కోట్లకు పైగా!
అదే సమయంలో ఓవర్సీస్‌లో కూడా సునామీ లెవెల్ రెస్పాన్స్, అక్కడ దాదాపు $2 మిలియన్ (₹17 కోట్లు) వసూలు చేసింది. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ₹68 కోట్లు దాటింది.
100 కోట్ల క్లబ్‌కు రాకౌంట్ డౌన్!
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి.
ప్రస్తుతం చూపుతున్న ట్రెండ్ చూస్తుంటే,
ఈ వారం ముగిసేలోపే “డ్యూడ్” ₹100 కోట్ల మార్క్ను దాటడం ఖాయం.
“లవ్ టుడే, డ్రాగన్” తరువాత, ఇది ప్రదీప్ రంగనాథన్‌కి మూడో వరుసగా 100 కోట్ల గ్రోసర్ అవుతుంది! అది కూడా ప్రేమ ఆధారిత థీమ్‌తోనే — ఇది అతని ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న మాస్ కనెక్ట్కి నిదర్శనం.
ఫైనల్ బజ్:
“రిస్క్ తీసుకున్నాడు… ఇప్పుడు రివార్డ్ తీసుకుంటున్నాడు!” “డ్యూడ్” – ప్రేమ కథలో పాయింట్ బోల్డ్, బాక్సాఫీస్‌లో ఫలితం గోల్డ్!
