
‘కాంత’ ప్రీమియర్ టాక్.. ఇండస్ట్రీ షాక్ !
దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ సినిమా రిలీజ్‌కు గంటలు మాత్రమే ఉండగా, ప్రీమియర్ షోల టాక్ మాత్రం సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది! చెన్నైలో జరిగిన ప్రెస్ ప్రీమియర్ నుండి వచ్చిన రివ్యూలు పూర్తిగా పాజిటివ్ మాత్రమే కాదు… “దుల్కర్ నటన నేషనల్ అవార్డు రేంజ్‌లో ఉంది” అని పలువురు రివ్యూవర్లు పేర్కొనడంతో సినిమా చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయింది.
1950ల మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీని బ్యాక్‌డ్రాప్‌గా తీసిన ఈ చిత్రంలో పిరియడ్ సెటప్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్, బిల్డప్ సీక్వెన్సులు—ఎవ్వరికీ తక్కువ కాకుండా అద్భుతంగా ఉన్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈరోజు తెలుగు ప్రీమియర్ జరగనుండగా…
“చెన్నైలానే ఇదే రేంజ్ టాక్ వస్తే, దుల్కర్‌కి ఇది టాలీవుడ్‌లో మరో ఆల్ టైమ్ హిట్!” అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్‌కి మరో సూపర్ హిట్ వచ్చేసిందా? అన్న ప్రశ్నతో అభిమానులు ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు.
