సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ మళ్లీ కొత్త మాయలో ముంచుతున్నాడు. ఈ సారి రానా దగ్గుబాటితో కలిసి తెరపైకి వస్తున్నాడు. ఈ ఇద్దరూ నటించడమే కాదు — నిర్మాతలుగా కూడా చేతులు కలిపారు! ఆ మిస్టరీ థ్రిల్లర్ పేరు — ‘కాంత’ (KAANTHA).
నవంబర్ 14న విడుదల కానున్న ఈ పీరియడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పుడు సంచలనంగా మారింది. మూడు నిమిషాల నిడివిలోనే కధలోని డ్రామా, ఎమోషన్, టెన్షన్ — అన్నీ పంచేసింది.
“ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది ఆ కథే నిర్ణయిస్తుంది…”
“ఒక న్యూస్… ఆ తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్… everything changed.”
“ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేశాయ్!”
ఇలా ఒక్కో లైన్ తోనే ఆ లోపల దాగిన అంతర్గత యుద్ధాన్ని, ఫేమ్ వెనుక మానవ పతనాన్ని చూపించాడు సెల్వమణి సెల్వరాజ్.
1950ల మద్రాస్ సినీ ప్రపంచం నేపథ్యంగా ఈ కథ నడుస్తుంది — గ్లామర్ వెనుక ఉన్న రాజకీయాలు, విభేదాలు, ఓ హీరో – దర్శకుడు మధ్య శక్తి పోరు. దుల్కర్ సల్మాన్ ఒక స్టార్ హీరోగా, సముద్రఖని దర్శకుడిగా, రానా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. రానా లుక్ – షార్ప్, ఇంటెన్స్. దుల్కర్ ప్రెజెన్స్ – మేజెస్టిక్! ‘మహానటి’ ఫ్లేవర్ తో పాటు ఓ పాత మద్రాస్ నాస్టాల్జియా కూడా ఇస్తోంది.
ట్రైలర్‌లోని విజువల్స్, సౌండ్ డిజైన్, బ్లాక్ అండ్ వైట్ ట్రీట్‌మెంట్ – అన్నీ హై ఎండ్ లెవెల్ లో ఉన్నాయి. “ఈ అద్భుతమే…” అనే మెలోడీ బ్యాక్‌డ్రాప్ లో వినిపిస్తే గూస్‌బంప్స్ తప్పవు.
సినీ వర్గాల టాక్ ప్రకారం, దుల్కర్ పోషించిన పాత్ర ఎం.కె. త్యాగరాజ భాగవతార్ హత్య కేసు ఇన్సిడెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యిందట. అంటే, రియల్ లైఫ్ నుంచి రీల్‌లోకి మారిన షాకింగ్ ట్రూత్ కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి!
ఇప్పటికే విడుదలైన ‘The Rage of Kaantha’ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ తో మాత్రం, ఈ సినిమా పట్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి.
దుల్కర్ ఫ్యాన్స్ కోసం ఇది మరో ఫెస్టివల్ మూవీ లాంటిది. 1950ల ప్యాషన్, పవర్, పతనం అన్నీ కలిపిన ఆర్ట్-టైప్ థ్రిల్లర్ – ఇది దుల్కర్ మార్క్ హై క్లాస్ ఎమోషనల్ స్టార్మ్ అనడంలో సందేహం లేదు.

