బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్- రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. కలెక్షన్లతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా కాలం ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. అలాగే ఇప్పటికి ఏదో విషయం ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో న్యూడ్ సీన్ గురించి దర్శకుడు వివరించి చెప్పుకొచ్చింది సైతం వైరల్ అవుతోంది.
దర్శకుడు సందీప్ వంగా మీడియాతో మాట్లాడుతూ… రణబీర్ నగ్నంగా నడుచుకుని వెళ్లే సీన్ తీయడాన్ని అతడు చాలా సులువు చేసాడని వంగా తెలిపారు. ఈ సీన్ కోసం కొన్ని గంటల పాటు రణబీర్ ని వెయిట్ చేయించారట సందీప్ వంగా. దర్శకుడి విజన్ ని నమ్మి హీరో స్వేచ్ఛనిచ్చాడని అన్నారు.
ఈ సీన్ తీసేప్పుడు మొదట తొడలు – శరీరం దిగువ భాగానికి ప్రోస్తేటిక్స్ పెట్టాలని అనుకున్నామని, టెస్ట్ షూట్ సమయంలో ఇది పర్ఫెక్ట్ గా వచ్చినా కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా కనిపించలేదని చెప్పాడు.
వాస్తవానికి, మేము సన్నివేశాన్ని పూర్తి ఫోకస్‌లో చిత్రీకరించాలని .. నగ్నంగా నడుస్తున్నప్పుడు గజ్జను కవర్ చేయడానికి ప్రాప్‌లను ఉపయోగించాలని ప్లాన్ చేసాము. అయితే ప్రోస్తేటిక్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో సన్నివేశాన్ని ఫోకస్‌లో లేకుండా బ్లర్ లో షూట్ చేసామని వంగా తెలిపాడు.