సినిమా వార్తలు

మాస్ మహారాజ్‌కి షాక్ ఇచ్చిన ఫ్యాన్స్‌ రివ్యూ! రవితేజ తీసుకున్న సడన్‌ డెసిషన్‌ ?

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో హిట్స్ ఉన్నా… అదే స్థాయిలో డెబాకిల్స్ కూడా ఎక్కువే. తాజాగా వచ్చిన “మాస్ జాతర” అయితే బాక్సాఫీస్‌ దగ్గర ఓపెనింగ్స్‌ కూడా రిజిస్టర్‌ చేయలేకపోయింది. ఈ ఫలితం చూసి డైహార్డ్ ఫ్యాన్స్‌ పూర్తిగా నిరాశ చెందిపోయారు. రవితేజ సినిమాల ఎంపికపై, ఆయన “ఎక్స్‌పెరిమెంట్స్‌” మీద ఉన్న ఆలోచనలపై సోషల్‌ మీడియాలో పెద్ద డిబేట్‌ మొదలైంది.

ఫ్యాన్స్‌ నేరుగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తూ — “ఇలా రొటీన్ కమర్షియల్‌ సినిమాలతో ముందుకెళ్లడం కుదరదు, ప్లీజ్‌ కొత్తగా ఆలోచించండి” అంటూ విజ్ఞప్తులు చేశారు. ఇంకొందరు అయితే బహిరంగంగానే అడిగేశారు — “ఎందుకు స్టార్‌ డైరెక్టర్లతో మళ్లీ పనిచేయడం లేదు?” అని. ఒకప్పుడు రవితేజే టాలెంటెడ్‌ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వాళ్లలో చాలామంది ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్లు. అయితే రవితేజ మాత్రం వారితో సినిమాలు చేయకుండా దూరంగా ఉంటున్నాడు.

ఇదే కాకుండా, “హ్యూజ్‌ రెమ్యునరేషన్‌ తీసుకుంటూ, టీమ్‌పై ఫోకస్‌ పెట్టడం లేదు” అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ మొత్తం ఫీడ్‌బ్యాక్‌ రవితేజ చెవుల్లోకి చేరింది. గత వారాంతంలో ఆయన స్వయంగా మీటింగ్‌ ఏర్పాటు చేసి ఫ్యాన్స్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ అందుకున్నారని టాక్‌. తన వైఫల్యాలపై సీరియస్‌గా అనాలసిస్‌ చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ మార్కెట్‌ గురించి కూడా చర్చ జరిగింది.

ఇప్పుడు రవితేజ “తప్పులనుండి నేర్చుకుని” స్లోగా, కచ్చితమైన స్క్రిప్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తొలిసారిగా ఆయన అభిమానుల మాట విని రియాక్ట్‌ అవుతున్న ఈ డెవలప్మెంట్‌పై ఇండస్ట్రీ అంతా సీరియస్‌గా గమనిస్తోంది.

మరి ఈసారి రవితేజ నిజంగా తన స్టైల్‌ మార్చేస్తాడా? లేక మళ్లీ అదే రొటీన్‌ ట్రాక్‌లోకే వెళ్తాడా?
సమాధానం రాబోయే సినిమాలతోనే తెలుస్తుంది!

Similar Posts