సినిమా అవకాశాలు లేక ఓ నటుడు మాఫియా వలలో చిక్కుకొని, రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే….

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న ఈ యువ నటుడు, 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో నటించిన విశాల్ బ్రహ్మ (32) గా గుర్తించారు.

సింగపూర్‌ నుంచి చెన్నై చేరుకున్న విశాల్ లగేజీని చెక్ చేయగా, ట్రాలీ బ్యాగ్‌లో అత్యంత ఖరీదైన మత్తు పదార్థం మెథాక్వలోన్ బయటపడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.40 కోట్లు అని అధికారులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాల్‌ను ఓ నైజీరియన్ ముఠా టార్గెట్ చేసినట్లు బయటపడింది. “కంబోడియా ట్రిప్” పేరుతో మొదట ట్రీట్ చేసి, తిరుగు ప్రయాణంలో డ్రగ్స్‌తో నింపిన బ్యాగ్‌ను తరలించమని చెప్పినట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నటుడు ఒప్పుకున్నాడని డీఆర్ఐ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఘటనతో డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు విచారణ విస్తరిస్తున్నారు అధికారులు.

ఇక ఇదే సమయంలో, దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత జూన్‌లో కోలీవుడ్ నటులు కృష్ణ, శ్రీకాంత్‌లు కూడా అరెస్టైన సంగతి గుర్తు.

ఇప్పుడు బాలీవుడ్ నటుడు పట్టుబడటంతో, “సినిమా ఇండస్ట్రీ–డ్రగ్స్ మాఫియా సంబంధాలు” మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.

, , , ,
You may also like
Latest Posts from