ఒకప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలంటే పిచ్చ క్రేజ్ ఉండేది. అయితే అది కొంతకాలంగా బాగా తగ్గింది. దానికి తోడు ఆయన డైరక్షన్ ప్రక్కన పెట్టి నటనలోకి వచ్చేసారు. ఆయన విక్రమ్ తో తీసిన సినిమా సైతం రిలీజ్ కు నోచు కోలేదు. దాంతో తన మాతృభాష అయిన మళయాళంకి వెళ్లి అక్కడ ముమ్మట్టితో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic And The Ladies Purse) అనే టైటిల్ తో ఓ క్రైమ్ థ్రిల్లర్ చేసారు. ఆ సినిమా రీసెంట్ గా రిలీజైంది. అయితే ఆ సినిమా ని అక్కడ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
“డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్” (Dominic and the Ladies Purse) చిత్రాన్ని మమ్ముట్టి నిర్మిస్తూ టైటిల్ పాత్ర పోషించడం విశేషం. మలయాళం డెబ్యూతో అయినా దర్శకుడిగా తన సత్తాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిరూపించుకుంటాడేమో అనుకుంటే అది జరగలేదు.
మమ్ముట్టి టైమింగ్ ఈ సినిమాలో కీలకాంశంగా మారింది. ఆయన వయసుకి తగ్గ పాత్ర ఇది.
చాలా రియలిస్టిక్ గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. ఫైట్స్ కూడా చాలా సింపుల్ గా డిజైన్ చేయడంతో మమ్ముట్టి ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండాపోయింది.
అయితే ముమ్మట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా నచ్చలేదు.
గౌతమ్ మీనన్ సరైన విజయం అందుకుని పదేళ్లు అవుతుందని చెప్పాలి. అజిత్ హీరో గా ఆయన దర్శకత్వం వహించిన ‘ఎన్నై ఆరిందాళ్’ (తెలుగులో ఎంతవాడుగాని పేరుతో విడుదల అయింది) మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత నాగచైతన్య హీరోగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేశారు. అది ఆశించిన విజయం సాధించలేదు.
ధనుష్, శింబు హీరోలుగా చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. విక్రమ్ హీరోగా చేసిన ‘ధ్రువ నక్షత్రం’ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి.