మ్యాచో హీరో గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. పక్కా కమర్షియల్, రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకున్నాయి. లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం డిజాస్టర్ గా నిలవడంతో గోపీచంద్ నిరాశచెందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా తన రూట్ మార్చుకుని డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ తన కొత్త మూవీని ప్రకటించాడు గోపీచంద్.
యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ఓ వినూత్నమైన యాడ్వెంచర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం స్వాతంత్ర్యానంతర నేపథ్యంతో తెరకెక్కనుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రానికి తొలిసారి మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు అశ్విన్ మడసు డైరెక్షన్ చేయనున్నాడు.
సినిమా షూటింగ్ మార్చి 2026 చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటికి గోపీచంద్ తన ప్రస్తుత రెండు సినిమాల షూటింగ్ పూర్తిచేయనున్నారు. ఓ విశ్వసనీయ వర్గం తెలిపిన వివరాల ప్రకారం – “ఈ సినిమాలో గోపీచంద్ ఓ కల్పిత పాత్రలో కనిపించబోతున్నారు. కథ స్వాతంత్ర్యానంతర కాలంలో కొనసాగుతుంది కానీ, ఇది స్వాతంత్ర్య పోరాటం గురించి కాదు.”
ప్రస్తుతం గోపీచంద్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌లో ఓ డెబ్యూయింట్ డైరెక్టర్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
హీరోయినుగా కొత్తదాన్ని పరిచయం చేయాలని దర్శక నిర్మాతల యోచన. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
దర్శకుడి గురించి చెబుతూ వర్గం వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి – “అశ్విన్ మడసు ఇప్పటికే ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ‘పింక్ లేడి’ అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి, కొన్ని అవార్డులు కూడా గెలిచారు. ఇది ఆయన తొలి ఫుల్ లెంగ్త్ సినిమా.”
తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేయనున్న ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభ తేదీగా 2026 మార్చి చివరను లక్ష్యంగా పెట్టుకున్నా, గోపీచంద్ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసే వేగాన్ని బట్టి ఫైనల్ డేట్ నిర్ణయించనున్నారు.