టాలీవుడ్, బాలీవుడ్‌లలో పాపులర్ అయిన హీరోయిన్ హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెపై దాఖలైన గృహహింస కేసును కొట్టివేయమని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో హన్సిక, ఆమె కుటుంబంపై కేసు కొనసాగనుంది.

సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్‌ జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్‌, తల్లి జ్యోతిలపై ముస్కాన్‌ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతిలకు ముంబయి సెషన్స్‌ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

కుటుంబ వివాదం నుంచి కోర్టు కు!

విడిపోయే ప్రక్రియలో, ముస్కాన్ తన అత్తగారు తో పాటు హన్సికపై కూడా హరాస్‌మెంట్ ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం – హన్సిక తనకు 20 లక్షల రూపాయల నగదు, ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాలని ప్రెషర్ చేసిందట. ఇవి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించిందని ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హన్సిక ఫ్యామిలీపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు నమోదైంది.

హన్సిక కౌంటర్ – “ఇది అసలు మనీ సెటిల్‌మెంట్ డ్రామా!”

హన్సిక తన పిటిషన్‌లో ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. అసలు సమస్య ఆర్థిక లావాదేవీల్లోనే ఉందని చెప్పింది. పెళ్లి కోసం ప్రశాంత్ 27 లక్షలు వెడ్డింగ్ ప్లానర్‌కి చెల్లించాడని, విడాకుల సమయంలో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని ముస్కాన్ పట్టుబట్టిందని పేర్కొంది.

“ఇది రివేంజ్ కేసు తప్ప అసలు హరాస్‌మెంట్ ఏమీ లేదు. నా ఇమేజ్ దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలా చేసింది” అని హన్సిక వాదించింది.

కానీ హైకోర్టు మాత్రం హన్సిక వాదనను పట్టించుకోలేదు. ఈ దశలో కేసు కొట్టివేయడానికి కారణం లేదని స్పష్టం చేసింది. దాంతో హన్సిక, ఆమె ఫ్యామిలీకి లాంగ్ లీగల్ బ్యాటిల్ తప్పదని తేలింది.

ప్రశాంత్ వెర్షన్ – “ముస్కానే నన్ను హరాస్ చేసింది”

ప్రశాంత్ మాత్రం మరో కోణం చెబుతున్నాడు. పెళ్లి తర్వాత నుంచే ముస్కాన్ తనపై హరాస్‌మెంట్ మొదలుపెట్టిందని, ఫాల్స్ కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా జరిగిందని అంటున్నాడు.

స్టార్ హీరోయిన్ లైఫ్‌లో టఫ్ ఫేజ్!

ఇక మరోవైపు, హన్సిక భర్త సోహైల్‌తో కూడా రిలేషన్‌లో ఇబ్బందులు వస్తున్నాయన్న రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హన్సిక వ్యక్తిగత, వృత్తి జీవితాలు రెండూ టెన్షన్‌లో ఉన్నాయి.

, , , , ,
You may also like
Latest Posts from