కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు తన సత్తా చూపించబోతున్నారు. కాంతారా మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపధ్యంలో కాంతారా: ఛాప్టర్ వన్ బిజినెస్ పై తెలుగు రాష్ట్రాల్లో భారీ హంగామా మొదలైంది.

ఇప్పటికే బిజినెస్ డీల్‌లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా అడ్వాన్స్ బేసిస్ పై డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్:

  • నిజాం : మైత్రీ
  • సీడెడ్ : శిల్పకళ
  • ఉత్తరాంధ్ర : విఘ్నేశ్వర
  • ఈస్ట్ & వెస్ట్ : గీతా
  • గుంటూరు : వరాహి
  • కృష్ణా : KSN
  • నెల్లూరు : SV

2022లో వచ్చిన కాంతారా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే బలంతో మేకర్స్ ఈసారి 100 కోట్ల షేర్ టార్గెట్ పెట్టుకున్నారు.

కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే – ఈ సినిమా పవన్ కళ్యాణ్ “OG” తో బాక్సాఫీస్ వార్‌కి రెడీ అవుతుంది! OG సెప్టెంబర్ 25న వస్తుండగా, కాంతారా ఛాప్టర్ వన్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది.

ట్రేడ్ సర్కిల్స్ టాక్ ఏమిటంటే – రిషబ్ శెట్టి మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తే, తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేయడంలో ఎలాంటి సందేహం లేదట. కానీ పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కాంతారా క్రేజ్ మధ్య అసలైన క్లాష్ ఎలా వుంటుందో చూడాలి!

మీరు ఏం అనుకుంటున్నారు? OG విన్ అవుతుందా? లేక కాంతారా బ్లాక్‌బస్టర్ అవుతుందా?

, , , , , ,
You may also like
Latest Posts from