హన్సిక(hansika) గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి దుమ్ము రేపింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఆ అమ్మడు. కుర్రాడు కలలు కనేలా హాట్ హాట్ గా అదరకొట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ (Junior NTR ,Allu Arjun)లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.2007లో దేశముదురు(Desamuduru) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 2011లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రంలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది.ఈ చిత్రం సక్సెస్‌ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా క్యూ కట్టాయి.

ఈ క్రమంలో బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్‌ లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది.

కాగా పలు భాషల్లో హీరోయిన్ గా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక (Hansika)ఆ మధ్య పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.

అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు.వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌ గా ఉంటోంది.

, , ,
You may also like
Latest Posts from