డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్‌ హిట్‌ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్‌’తో రీసెంట్ గా (ఏప్రిల్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ పడలేదు సరికదా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో పంచాయితి వెళ్లిందని టాక్.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు హీరో సిద్దుకి రూ.12 కోట్ల పారితోషికం ఇచ్చారు. అయితే ఈ సినిమా ఒప్పుకొనేముందు ఆ హీరోకి అంత క్రేజ్ లేదు. లేటెస్ట్ సినిమా హిట్ట‌య్యింద‌ని చెప్పి, రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. హీరో క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే ఉద్దేశంలో నిర్మాత కూడా అడిగినంత ఇచ్చాడు. సినిమా కూడా భారీగా తీశారు.

అయితే.. క‌నీసం ఓపెనింగ్స్ కూడారాలేదు. రూపాయికి రూపాయి పోయిన‌ట్టే అయ్యింది. డిస్టిబ్యూట‌ర్లేమో ‘మేం మీ సినిమాని కొని న‌ష్ట‌పోయాం. ఎంతో కొంత వెన‌క్కి ఇవ్వాల్సిందే’ అంటూ నిర్మాత‌పై ఫిర్యాదు చేస్తే, ఆ నిర్మాత ఏమో హీరోని న‌మ్మి సినిమా తీశాం. భారీగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చాం. ఇప్పుడు న‌ష్టాలొస్తే హీరోదే బాధ్య‌త క‌దా, హీరోనే పారితోషికం తిరిగి ఇవ్వాలి అని ఆయా హీరోల‌పై ఫిర్యాదు చేశారు.

‘నిన్ను చూసే క‌దా, ఇంత పెట్టుబ‌డి పెట్టింది. ఎంతోకొంత తిరిగి ఇవ్వాల్సిందే’ అంటూ పంచాయితీకి వ‌చ్చారని వినిపిస్తోంది. హీరో మాత్రం దీనిపై ఇప్పటిదాకా స్పందించ‌డం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.

, , ,
You may also like
Latest Posts from