పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు రోజు రాత్రి (జూలై 23న) చిత్రబృందం స్పెషల్/పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించగా, అద్భుతమైన క్రౌడ్‌ వచ్చినప్పటికీ, షో అయ్యాక ప్రేక్షకుల స్పందన మాత్రం నిరాశపరిచేలా మారింది.

రెండో భాగంలో 15 నిమిషాల తక్కువ!

విశేషంగా విమర్శలు వచ్చిన అంశం – సినిమాలోని రెండో భాగం. ముఖ్యంగా అందులో ఉన్న tacky VFX, పాతికిపోయిన గ్రాఫిక్స్ షాట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దాంతో మేకర్స్ వెంటనే నిర్ణయం తీసుకుని, రెండో భాగం నుంచి దాదాపు 15 నిమిషాల ఫుటేజ్ కట్ చేయబోతున్నారు. ముఖ్యంగా పనిచేయని విజువల్ ఎఫెక్ట్స్, స్లో పేస్ సీన్లే తొలగించనున్నట్టు సమాచారం.

ఇప్పుడు ట్రిమ్మింగ్ వల్ల మారుతుందా?

ఇప్పటికే దెబ్బ తిన్న WOM (వర్డ్ ఆఫ్ మౌత్)ను తిరగదొరకటం సాధ్యమా? కథలో, ఫ్లోలో మార్పులు లేకపోతే, కేవలం సన్నివేశాల కత్తెరతో మళ్లీ ఆకట్టుకోవటం కష్టమేనన్నది పరిశీలకుల అభిప్రాయం.

ముందుగానే చూసుంటే…

ఈ స్థాయిలో బడ్జెట్ వేసిన సినిమాకు, అంతగా క్రేజ్ ఉన్న స్టార్ కోసం రూపొందించిన ప్రాజెక్టుకు ఇలాంటి తప్పిదాలు ఎదురవడం గమనార్హం. రిలీజ్‌కి ముందే VFX పర్ఫెక్షన్, ఎడిటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది మేకర్స్. ఇప్పుడు ట్రిమ్మింగ్‌తో సినిమా ఏ స్థాయిలో మారుతుంది అనేది వేచి చూడాలి.

, , , , , ,
You may also like
Latest Posts from