మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కు అనుకున్న స్దాయిలో బజ్‌ క్రియేట్ కాలేదు, ఇటు సోషల్ మీడియా హంగామా కూడా లేదు. కానీ ఈ సినిమాపైనే మంచు విష్ణు తన జీవితాన్ని పెట్టానని చెప్తున్నారు. ఈ సినిమా కోసం 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని చెప్తున్నారు. ఇంకెవరైనా ఉంటే ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సినిమా అమ్మేసి లాభాల్లోకి వచ్చేవాడు. కానీ విష్ణు వేసిన ప్లాన్ మాత్రం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేలా ఉంది.

200 కోట్ల బడ్జెట్… రిలీజ్‌కి ముందే రికవరీ?

విష్ణు తన ఇంటి ఆస్తులను బ్యాంకులో పెట్టి, రుణం తీసుకుని ఈ సినిమా తీసానని చెప్తున్నారు. రెగ్యులర్ నిర్మాత అయితే సినిమా రిలీజ్‌కి ముందే నాన్-థియేట్రికల్ రైట్స్‌ అమ్మేసి ఫైనాన్షియల్ బరువు తగ్గించుకుంటాడు. కానీ విష్ణు అలాచేయలేదు.

OTT ప్లాట్‌ఫామ్స్… అనుకున్న ధర ఇవ్వలేదట. కానీ సినిమా హిట్ అయితే అదే ధర ఇస్తామని చెప్పాయట. అంటే — ఈ సినిమా ఓటిటికి హిట్ అయ్యాకే అమ్ముతారు! అంతేకాక, OTTకి 8 వారాల విండో ఇవ్వబోతున్నట్లు విష్ణు వెల్లడించాడు.

ఆడియో – శాటిలైట్ డీల్స్ ఇంకా క్లియర్ కాదు

విష్ణు ప్రకారం, ఆడియో హక్కులు కూడా కేవలం ఔట్‌రైట్‌గా అమ్మడం కన్నా రాయల్టీ మోడల్లో చూసే ప్రయత్నంలో ఉన్నారట. శాటిలైట్ హక్కుల గురించి చర్చలు నడుస్తున్నాయే తప్ప, ఇంకా డీల్‌ ఫైనల్ కాలేదట.

థియేటర్ బిజినెస్ మీదే మొత్తం రికవరీ ప్లాన్?

ఇదంతా చూస్తే, కన్నప్ప బడ్జెట్‌ను రిలీజ్‌కి ముందే రికవర్ చేయలేదని స్పష్టమవుతుంది. కానీ విష్ణు మాత్రం ధీమాగా ఉన్నాడు — సినిమా విడుదలయ్యాక థియేట్రికల్ బిజినెస్‌ ద్వారా మొత్తం బడ్జెట్ తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఇలాంటి టైంలో కన్నప్ప లాంటి ప్యూరిటీ-డ్రివెన్ డివోషనల్ కథకు థియేటర్లలో హిట్ అవ్వాలంటే – ఆడియన్స్ కనెక్ట్ కావాలి. కంటెంట్ విషయంలో విష్ణుకు మంచి నమ్మకం ఉన్నట్టే ఆయన మాటల్లో కనిపిస్తోంది.

, , , , , ,
You may also like
Latest Posts from