విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండ్ మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’ మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే . గతేడాది ‘ఇండియన్ 2’తో డిజాస్టర్ అందుకున్న కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే అలాంటిదేమీ జరగటం లేదు. తొలి రోజు టాక్‌తోనే విషయం తేలిపోయింది.
ఫస్ట్ డే ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లే ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన రెండు రోజుల్లోనే ఇండియన్ 2తో పోల్చుకుంటే ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 38 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా, నెగటివ్ మౌత్-టాక్ కారణంగా రెండవ రోజు కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. “నాయకుడు” లాంటి క్లాసిక్ తర్వాత కమల్-మణిరత్నం కలయిక నుండి వచ్చిన ఈ ఫిల్మ్ ఆ స్దాయిలో లేకపోవడం, ప్రేక్షకుల నిరాదరణకు కారణమయ్యింది.
ఇండియన్ 2 vs టగ్ లైఫ్ – నంబర్ల తేడా ఏమిటి?
ఇండియన్ 2: ఫస్ట్ వీకెండ్ కల్లా దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేసి, పూర్తి రన్లో 150 కోట్లు దాటింది.
థగ్ లైఫ్: రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడంతో, సినిమా ₹100 కోట్లు దాటుతుందో లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.