సినిమా వార్తలు

‘వారణాసి’ బడ్జెట్ ఎంత? – ఈ అంకెలు వింటే షాక్ అవ్వాల్సిందే!

ఈ రోజుల్లో పెద్ద సినిమాల బడ్జెట్లు ఎవరూ ఊహించనంత స్థాయికి వెళ్లిపోయాయి. అందులోనూ కేవలం లోకల్ మార్కెట్‌కే కాదు, గ్లోబల్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ సినిమా తీయాలంటే ఖర్చుల లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అంతర్జాతీయ టెక్నికల్ టీమ్స్, వరల్డ్‌వైడ్ రిలీజ్ ప్లాన్స్… ఇవన్నీ కలిస్తే బడ్జెట్ అనే మాటకు కొత్త అర్థమే వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా బడ్జెట్ ఖచ్చితంగా అందరి అంచనాలను మించిపోతుందన్న భావన బలంగా వినిపిస్తోంది. అసలు ఈ సినిమాకు ఎంత ఖర్చవుతోంది? రూ. వందల కోట్లు దాటిందా? వేల కోట్ల దిశగా వెళ్తోందా? అనే చర్చ ఇప్పుడు కేవలం ఫిల్మ్ సర్కిల్స్‌లోనే కాదు, సామాన్య ప్రేక్షకుల మధ్య కూడా మొదలైపోవడం ‘వారణాసి’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. మరి ఈ సినిమాకు బడ్జెట్ ఎంత ఉండచ్చు.

ప్లానింగ్ విషయంలో ఎస్.ఎస్. రాజమౌళిని మించిన దర్శకుడు టాలీవుడ్‌లోనే లేడన్నది చాలామంది ఒప్పుకునే నిజం. ఎప్పుడు ఎవ‌రితో సినిమా తీయాలి, ఆ ప్రాజెక్ట్‌ను ఎలా మార్కెట్ చేయాలి, ఎలాంటి టైమింగ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న ప్రతీ విషయంలో జక్కన్న ప్లానింగ్ చాలా పక్కాగా ఉంటుంది. అంతేకాదు, బడ్జెట్ దగ్గర కూడా ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. రాజమౌళి సినిమాలన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయి కానీ ఆ భారీతనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎంతలో తీయాలో అంతలోనే తీసి, ఖర్చు నియంత్రణను ఎప్పుడూ చేతుల్లో ఉంచుతారు. పది శాతం అటూ ఇటూ అవడం సాధారణమే కానీ, దాన్ని మించనివ్వరు.

అయితే తాజాగా రూపొందుతున్న ‘వారణాసి’ విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ మారిపోయినట్లు ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి బడ్జెట్ హద్దులు పెట్టుకోలేదన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ‘వారణాసి’ బడ్జెట్ ఎంత అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు తిరుగుతున్నాయి. కొందరు రూ.700 కోట్లు అంటుంటే, మరికొందరు రూ.1000 కోట్లు, ఇంకొందరు అయితే రూ.1500 కోట్లు దాటిందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ అంకెలన్నీ విని షాక్ అవ్వాల్సిన పనిలేదని, అవసరమైతే ఇవన్నీ దాటినా రాజమౌళి ఆశ్చర్యపోరన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

దీనికి కారణం ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసమే. తాను ఎంత ఖర్చు పెట్టినా, తన సినిమా ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టగలదన్న నమ్మకం రాజమౌళికి ఉంది. అంతేకాదు, ‘వారణాసి’ని హాలీవుడ్ వెర్షన్‌గా కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉందని టాక్. ఒకవేళ అక్కడ మార్కెట్ సరిగా క్రియేట్ చేయగలిగితే, వసూళ్లకు హద్దులే ఉండవన్న ధీమాతోనే ఖర్చు విషయంలో రాజమౌళి వెనుకడుగు వేయడం లేదని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా విషయంలో మరో కీలక అంశం ఏమిటంటే, మహేశ్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తుండటం. హీరో పారితోషికం భారం కాకపోతే దర్శకుడు, నిర్మాతలకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఆ మొత్తాన్ని నేరుగా సినిమా మేకింగ్ మీద పెట్టుకోవచ్చు. భారీ సెట్లు, అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాల విజువల్స్… ఇవన్నీ ఆలోచించడానికి బడ్జెట్ అడ్డంకిగా నిలవకపోవడం ‘వారణాసి’కి పెద్ద ప్లస్ అవుతోంది.

ఇప్పటివరకు ఒక పరిమిత బడ్జెట్‌లోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన రాజమౌళి, ఆ హద్దులే లేకపోతే ఇంకేం చేస్తాడో ఊహించుకోవడమే ఆసక్తికరం. అందుకే ‘వారణాసి’ విషయంలో ప్రతి చిన్న అప్డేట్ కూడా భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, బడ్జెట్ చుట్టూ తిరుగుతున్న ఈ చర్చలే రాజమౌళి ఈసారి ఏ స్థాయి సెన్సేషన్‌కు సిద్ధమవుతున్నాడో చెప్పకనే చెబుతున్నాయి.

Similar Posts