
పాన్-ఇండియా హీరో అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ విడుదల మళ్లీ వాయిదా పడింది. మొదటగా ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. కానీ శేష్ ఇటీవల కాలిలో గాయపడటం వల్ల షూటింగ్ షెడ్యూల్ దెబ్బతింది.
సినిమాలోని కీలకమైన, హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీన్ ఇంకా మిగిలే ఉంది. ఆ సీన్ కోసం శేష్ పూర్తిగా ఫిట్ అవ్వాలి. కాబట్టి హీరో సేఫ్టీ, సినిమా క్వాలిటీ కోసం టీమ్ రిలీజ్‌ను వాయిదా వేసింది. శేష్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు.
కొత్త రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని యూనిట్ తెలిపింది.
ఇటీవల నాని నటించిన హిట్ 3లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన అడవి శేష్..ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ముందు హీరోయిన్‌గా శ్రుతి హాసన్ ఎంపికైంది. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె తప్పుకోగా, మృణాల్ ఠాకుర్ వచ్చి చేరింది. ఇప్పటికే, డెకాయిట్ రాక చాలా ఆలస్యం అయింది.
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఖచ్చితంగా ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు.
కానీ, తాజా సమాచారం మేరకు, మరోసారి డెకాయిట్ చిత్రాన్ని వాయిదా వేయక తప్పేలాలేదనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అడవి శేష్ కి గాయం అవడమే అని సమాచారం. శేష్ కాలికి గాయం అవడంతో కోలుకొని సెట్స్ లో జాయిన్ అవడానికి ఇంకా సమయం పడుతుందట. అందుకే, షూటింగ్ సహా, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాదని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే పోస్ట్ పోన్ చేసేందుకు ప్లాన్ చేస్తూ, కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నటు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా షనీల్ డియో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, ఈ మూవీ పోస్టర్స్ వచ్చి హైప్ ని క్రియేట్ చేశాయి.
ఈ సినిమాతో శనియల్ డియో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. రివెంజ్ డ్రామాతో పాటు యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఇన్‌స్పెక్టర్ స్వామి పాత్రలో కనిపించబోతున్నారు.
‘మేజర్’ తరహాలోనే మరో ఇంటెన్స్ రైడ్ కోసం అడివి శేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు మొదలయ్యాయి!
