విరుపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి సినిమాల అనౌన్స్‌మెంట్లు రాకపోవడం పై ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తేజ్, తన హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయ‌న కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం తేజ్ సాంబరాల ఏటిగట్టు అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను బల్క్ డేట్స్ కేటాయించడంతో ఇతర సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం తెరపైకి వచ్చింది. పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, తేజ్ ప్రస్తుత ఫిల్మ్ ఛాయిస్‌ల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నాడు. కమర్షియల్‌గా కాకుండా కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. దాంతో, తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసే హీరోల రేసులో తేజు ఉండడంలేదు.

ఇక మరోవైపు, అతని రెమ్యునరేషన్ విషయంలోనూ కొన్ని ప్రొడక్షన్ హౌజెస్ వెనుకంజ వేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. భారీ రెమ్యునరేషన్, క్లాస్ + మాస్ మిక్స్ కావాల్సిన కథ – ఇవే తేజ్ ఎంపికల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్న అంశాలంటున్నారు.

ఇదిలా ఉండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వెలువడుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నాడట. అలాగే, గీతా ఆర్ట్స్‌తోనూ ఓ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని సమాచారం. కానీ ఈ రెండు సినిమాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

, ,
You may also like
Latest Posts from