సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా, విలన్‌గా మెప్పించిన జగపతి బాబు జీవితంలో వెండితెరకు మించిన డ్రామా ఉంది. ఆయన రెండు సార్లు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగి వచ్చారంటే నమ్మగలరా? తాజాగా ఆయన పంచుకున్న ఈ మరణ గండాల కథ వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అస్సలు నమ్మలేని ఆ భయంకరమైన సంఘటనలు మీకోసం..

సజీవ సమాధి.. ఆ 32 సెకన్లు నరకం!

ఒక షూటింగ్ సమయంలో జగపతి బాబును ఒక కాఫిన్ (పెట్టె)లో పెట్టి అండర్ గ్రౌండ్‌లో సమాధి చేశారు. అనుకున్న టైమ్ కంటే ఒక 32 సెకన్లు లేట్ అవ్వడంతో లోపల ఆక్సిజన్ అయిపోయింది. బ్రీతింగ్ టెక్నిక్‌తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయన పోరాడుతుంటే, బయట వాళ్ళు ఆయన చనిపోయారని ఏడవడం మొదలుపెట్టారు. చివరకు ఆ పెట్టెను వెతికి తీసేసరికి ఆయన చావు అంచుల్లో ఉన్నారు. అయితే ఆ రోజే విజయవాడ నుండి ఒక ఆస్ట్రాలజర్ ఫోన్ చేసి ఆయనకు మరణ గండం ఉందని ముందే హెచ్చరించడం విశేషం.

ఫ్లైట్ క్రాష్.. తండ్రిని కాపాడిన ఆ చిరాకు!

జగపతి బాబు తండ్రి వి.బి. రాజేంద్ర ప్రసాద్ విషయంలో జరిగిన సంఘటన మరీ వింతగా ఉంటుంది. 1980 ప్రాంతంలో బాంబే నుండి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ క్రాష్ అయ్యి అందరూ చనిపోయారు. అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినా, ఫ్లైట్ లేట్ అవ్వడంతో వచ్చిన చిరాకులో బోర్డింగ్ పాస్ చింపేసి బయటకు వచ్చేయడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన జాతకంలో ఆ టైమ్‌లో గండం ఉందని, పూజలు చేస్తే ప్రాణాపాయం తప్పుతుందని ముందే రాసి ఉందట.

జాతకం అంటే నమ్మక చస్తానా?

తమ కుటుంబంలో జరిగిన ఈ మిరాకిల్స్ చూశాక జాతకాన్ని నమ్మకుండా ఎలా ఉంటాను అని జగపతి బాబు ప్రశ్నిస్తున్నారు. సైన్స్ కి కూడా అందని ఏదో శక్తి ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

అదృష్టం, జాతకం కలిసి వస్తే గానీ మృత్యువు నోట్లో నుండి తిరిగి రావడం సాధ్యం కాదని జగపతి బాబు మాటల్లో అర్థమవుతోంది. మరి ఈ వింత సంఘటనల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

#Astrology, #Death Experience, #jagapathi babu, #Tollywood

By admin