
‘జన నాయకన్’ టీం తీసుకున్న ఈ రిస్క్… ఇండియా అంతా మాట్లాడుతోంది!
విజయ్ – హెచ్. వినోద్ కాంబినేషన్లో వస్తున్న ‘జన నాయకన్’ ఆడియో లాంచ్‌ని డిసెంబర్ 27న మలేషియాలో నిర్వహించబోతున్నట్టు టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో జోష్ పెరిగిపోయింది.
KVN ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన 5½ నిమిషాల ధమాకా టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని అతిపెద్ద వేదిక – మలేషియా బుకిట్ జలిల్ స్టేడియంలో జరగనుంది. సామర్థ్యం? 87,500+ సీట్లు! ఇదే చూస్తే సరిపోతుంది… ఈ ఈవెంట్ ఎంత భారీగా ఉండబోతోందో!
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కూడా ఉండడంతో ఫ్యాన్స్ ఇంకా హైప్ అయ్యారు. మరో షాకింగ్ హైలైట్ ఏమిటంటే— విజయ్ ప్రకటించిన ఫిల్మ్ రిటైర్మెంట్ ముందు జరిగే ప్రమోషనల్ ఈవెంట్ ఇదే కావడం!
ఇక హీరోయిన్స్‌గా మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. జనవరి 9, 2026 న సంక్రాంతి/పొంగల్ రేస్‌లో సినిమా థియేటర్లకు రానుంది. పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
మలేషియాలో ఎందుకు?
ప్రొడ్యూసర్ల ప్లాన్ దురుసుగా, స్మార్ట్‌గా ఉందంటూ ఇండస్ట్రీలో చర్చలు!ఫ్యాన్డమ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఈ భారీ ఈవెంట్‌తో క్లియర్ అవుతోంది.
