‘ఆక్వామ్యాన్‌’ హీరో జేసన్ మొమోవా తన గడ్డాన్ని 6 ఏళ్ల తర్వాత తొలిసారి షేవ్‌ చేశాడు! అదేంటి షాక్ అవుతున్నారా? ఈ లుక్ మార్పు అన్నదీ ఆశ్చర్యంగానే జరిగింది.

జూలై 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో జేసన్, తన గడ్డం తీసేసిన తర్వాత సూటిగా చెప్పాడు – “చెదిరిపోయింది, నాకే నచ్చడం లేదు!” అని. కానీ ఇంతకీ ఎందుకు తీసేశాడు?

ప్రముఖ డైరెక్టర్ డెనిస్ విల్నెవ్ తీస్తున్న ‘డ్యూన్: పార్ట్ 3’ కోసం మొమోయా రెడీ అవుతున్నాడు. ఇందులో అతను మళ్లీ డంకన్ ఐడహో పాత్రలోకి తిరిగొస్తున్నాడు – 2024లో వచ్చిన రెండో పార్ట్‌లో ఆయన్ను మిస్ అయినవాళ్లకు ఇది హ్యాపీ న్యూస్!

“ఇది ఓ కొత్త అధ్యాయానికి కిక్‌ఆఫ్‌ లాంటిదే… డెనిస్ కోసం మాత్రమే ఇలా చేస్తున్నా!” అంటూ విల్నెవ్‌కి డెడికేషన్ చూపించాడు మొమోయా.

అంతే కాదు… జేసన్ మొమోయా కుమారుడు నకోవా-వోల్ఫ్ (16 ఏళ్లు) కూడా ఈ సినిమాలో డెబ్యూ చేస్తున్నాడు. అతను నటుడు టిమొతీ చలమె, జెండయా పాత్రలకు పుట్టిన కొడుకు లేటో II పాత్రలో కనిపించబోతున్నాడు!

“అవును తొలిసారి ఆ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. బాగా పని చేయాల్సిందే… ఇప్పుడు అసలైన ‘రియాలిటీ’ తెలిసే టైమ్ వచ్చేసింది!” అంటూ తన కొడుకును సరదాగా టీజ్ చేశాడు జేసన్.

డ్యూన్ అభిమానులూ, మొమోయా ఫాలోవర్లూ… గడ్డం పోయినా, క్యారెక్టర్లో ఫైర్ మిస్ అవ్వదు అనేది మాత్రం గ్యారంటీ!

,
You may also like
Latest Posts from