గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’. బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి తీసుకురావడానికి నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ‘డాకు మహారాజ్’ థియేటర్లలో విడుదలకు కావడానికి ముందు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తీసుకుంది.
ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో ‘డాకు మహారాజ్’ సినిమా స్ట్రీమింగ్ చేస్తోంది నెట్ఫ్లిక్స్ . ‘అనగనగా ఒక రాజు… చెడ్డవాళ్ళు అందరూ డాకు అనేవాళ్లు… కానీ మాకు మాత్రం మహారాజు’ అని మంచి క్యాప్షన్ తో ఈ సినిమాని దింపింది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు ఓటిటిలోకి వచ్చాక ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది, దారుణమైన విమర్శలు వస్తున్నాయి.
‘డాకు మహారాజ్’ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా… విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ నటించారు.
అయితే బాబీ డయోల్ పాత్ర లో అసలు ఎమోషన్ లేదని, కేవలం ఏదో పనిగట్టుకుని హత్యలు చేస్తున్నట్లు విలనిజం చిత్రీకరించారని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
అలాగే బాలయ్య నటనను కొందరు విమర్శిస్తున్నారు. తెలుగులో ఓకే అనిపించుకున్న ఈ చిత్రం నార్త్ వాళ్లకు అసలు ఎక్కలేదు. బాబీడయోల్ నట శూన్య అంటూ ఎక్సప్రెషన్స్ లేవు అంటూ ఆడేసుకుంటున్నారు.