
కల్యాణ్ రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన జోడీ కట్టబోయే వ్యక్తి ఒక స్టార్ రైటర్! తెలుగులో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA)’, ‘వెంకీమామ’, ‘18 పేజెస్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో తన సొంత ముద్ర వేసుకున్న రచయిత శ్రీకాంత్ విస్సా, ఇప్పుడు డైరెక్టర్‌గా మారుతున్నారు.
ఇటీవల శ్రీకాంత్ విస్సా ఓ పవర్‌ఫుల్ స్టోరీని కల్యాణ్ రామ్‌కు వినిపించగా, ఆయనకు అది బాగా నచ్చిందట. కథ విన్న వెంటనే “ఇదే నా నెక్స్ట్!” అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇంతకీ, ఈ ప్రాజెక్ట్‌కి ప్రత్యేకత ఏమిటంటే — ‘రావణాసుర’, ‘డెవిల్’, ‘పుష్పా’ ఫ్రాంచైజ్, అలాగే కల్యాణ్ రామ్ నటించిన ‘S/O వైజయంతి’ సినిమాకి కూడా స్క్రీన్‌ప్లే రాసింది ఇదే శ్రీకాంత్ విస్సా.
క్రియేటివ్ ఆలోచనలతో కొత్త టాలెంట్‌కి ఎప్పుడూ అవకాశాలు ఇస్తూ ఉంటారు కల్యాణ్ రామ్. ‘S/O వైజయంతి’ తర్వాత ఆయన ఏం చేస్తారో అనేది ఫ్యాన్స్‌లో పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌తో ఆ సస్పెన్స్ క్లియర్ అయ్యేలా ఉంది!
ఇక ఈసారి స్టార్ రైటర్ – స్టార్ హీరో కాంబో ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి!
