మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ మొదలైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలకు పిలక,గిలక అనే పేర్లను పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.
ఆ పాత్రలను తొలగించాలి
గుంటూరుకు సంబంధించిన బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఆ పాత్రలను తొలగించారో లేదా క్లారిటీ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసారు. దీనిపైన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరణ ఇచ్చారు. దానికి సి బి ఎఫ్ సి వాళ్లు రిప్లై నోటు కూడా ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సెన్సార్ ఏమీ జరగలేదు.
సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను గుంటూరులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో అయినా ఆ పాత్రలను తొలగిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వాలి అని శ్రీధర్ తెలిపారు. అలానే గతంలో కూడా దేనికైనా రెడీ సినిమాకు సంబంధించి బ్రాహ్మణులను కించపరిచారు అంటూ మరోమారు గుర్తు చేశారు.
ఇక ఈ విషయంపై కన్నప్ప చిత్ర యూనిట్ యూనిట్ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు జరగడం అనేది ఊహించలేనిది.