
స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించి సంచలన హిట్ సాధించిన ‘కాంతార’ కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యూఎస్‌లో అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న ప్రీమియర్స్ పెట్టాలని అనుకున్నారు. కానీ షాకింగ్‌గా అక్కడ షోస్ రద్దయ్యాయని సమాచారం.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా ఐమ్యాక్స్ వెర్షన్ డెలివరీలో జాప్యం రావడంతో, అక్కడి ప్రీమియర్ షోస్ ఆగిపోయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ క్లారిటీ ఇస్తూ – “ఐమ్యాక్స్ కోసం వెయిట్ చెయ్యొద్దు, రెగ్యులర్ షోస్ ఉంటే చూసేయండి” అని చెప్పేశారు. ఈ మేరకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్ద ట్వీట్ వేసింది.
#KantaraChapter1 North America IMAX Content & Shows Update:#Telugu, #Kannada & #Hindi @IMAX content of #KantaraChapter1 still not received by Qube LA office and may get it in next 3-4 hours. So most of the theatres cancelled @IMAX screenings at this point and only very few…
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 30, 2025
అందుకే చాలాకాలంగా ప్రణాళికలు వేసుకున్న యూఎస్ ప్రీమియర్ షోస్ హఠాత్తుగా ఆగిపోవడం కాంతార బజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
ఏపీలో టికెట్ రేట్లకు పవన్ గ్రీన్ సిగ్నల్!
ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హైప్ ఆపలేని స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్స్: ₹75 + జీఎస్టీ అదనం
మల్టీప్లెక్స్‌లు: ₹100 + జీఎస్టీ అదనం
అలాగే అక్టోబర్ 1 రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోస్ వేసుకునేందుకు కూడా ఓకే చెప్పింది.
ఒక వైపు అమెరికాలో షోస్ ఆగిపోవడం, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ అనుమతులు రావడం… కాంతార 1 రిలీజ్ చుట్టూ అసలు గేమ్ స్టార్ట్ అయినట్టే!
