రిషబ్ శెట్టి మాంత్రికం మళ్లీ పనిచేసింది!

‘కాంతార చాప్టర్ 1’ రెండో వారాంతానికే దేశవ్యాప్తంగా ₹100 కోట్లు దాటేసి, మరోసారి సంచలనం సృష్టించింది. ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి దూసుకుపోతోంది.

రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన కలెక్షన్లు నమోదు కావడం వల్ల, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా చాలాసేపు ఊపిరి పీలుస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో పెరిగింది. ఇక దీపావళి వీకెండ్ కూడా వస్తుండటంతో, రన్ మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ 11 రోజుల్లోనే సుమారు ₹600 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది . అన్ని భాషల్లోనూ సినిమా నంబర్స్ స్ట్రాంగ్‌గా నిలుస్తుండటంతో, ట్రేడ్ వర్గాలు ఇప్పుడు ₹750 కోట్ల పైగా కలెక్షన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇక ఇలా కొనసాగితే, ‘కాంతార చాప్టర్ 1’ ఈ ఏడాది ‘ఛావా’ను కూడా దాటేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశముంది!

, , , ,
You may also like
Latest Posts from