
కీర్తి సురేష్ కూడా AI స్కాంలో చిక్కుకుంది
సోషల్ మీడియాలో రోజురోజుకూ పెరుగుతున్న AI-జెనరేటెడ్ ఫేక్ ఫోటోలు ఇప్పుడు హీరోయిన్స్ కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే జాన్వి కపూర్, రష్మిక మందన్నా వంటి పలువురు హీరోయిన్లు ఈ సమస్యను బహిరంగంగా ఎత్తిచూపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి కీర్తి సురేష్ కూడా చేరింది.
తన ఫోటోల్ని AI తో మార్చి, అసలు లేని డ్రెసులు, అసహజమైన పోజులు పెట్టి వైరల్ చేస్తున్న దృశ్యాలు చూసి కీర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
“ఇది నిజంగా పెద్ద సమస్యగా మారింది. నా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల్ని తీసుకుని ఇష్టానుసారం మార్చి పోస్టు చేస్తున్నారు. ఆ ఫోటోలు చూసి నాకు షాక్ అనిపించింది. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది” అని కీర్తి స్పష్టంగా చెప్పింది.
ఈ ఘటనపై ఆమె అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి AI దుర్వినియోగాన్ని ఎలా ఆపాలి?
ఆర్టిస్ట్ లు ఎలా తమ ఇమేజ్‌ను కాపాడుకోవాలి? అనేవి ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి.
ఇక కెరీర్ పరంగా మాట్లాడితే—కీర్తి సురేష్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, రవి కిరణ్ కొళ్ల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న కొత్త చిత్రంలో నటిస్తోంది.
