
నన్ను అసభ్యంగా తాకిన ఆ చెయ్యి… ఇప్పటికీ వణుకు!” – మంచు లక్ష్మి షాకింగ్ అనుభవం
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన చిన్ననాటి నుండి వెంటాడుతున్న ఓ చేదుఅనుభవాన్ని వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సెలబ్రిటీ కుటుంబంలో పెరిగిన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, రోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎంత తీవ్రమై ఉంటాయో ఊహించలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నప్పటి నుంచి సొంత వాహనాల్లోనే బాడీగార్డులతో తిరిగే తనను, ఒకసారి పరీక్షల హాల్ టికెట్ల కోసం స్కూల్ పబ్లిక్ బస్సులో తీసుకెళ్లిందని చెప్పారు. అదే తన మొదటి బస్సు ప్రయాణమని, ఆ ఉత్సాహంలో ఉన్న సమయంలోనే వెనుకనుంచి ఓ వ్యక్తి అసభ్యంగా తాకడంతో షాక్‌కు గురయ్యానని ఆమె గుర్తుచేశారు.
“ఏం జరుగుతుందో అర్థం కాలేదు… భయంతో వణికిపోయా. ఆ క్షణం ఇప్పటికీ మర్చిపోలేను” అని మంచు లక్ష్మి అన్నారు.
ఈ విషయం స్నేహితులతో పంచుకున్న తర్వాత కాస్త ధైర్యం వచ్చిందని,చెప్పింది. అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే అనేక మహిళలు ఇలాంటి వేధింపులను ప్రతి రోజు మౌనంగా భరిస్తున్నారనే నిజం బాధిస్తోందని తెలిపింది.
ఎన్నో మహిళలు తమకు జరిగే అవమానాల గురించి బయటకు చెప్పుకోలేక మానసిక క్షోభ ఎదుర్కొంటున్నారని, మహిళల భద్రత విషయంలో సమాజం మరింతగా బాధ్యత తీసుకోవాలని మంచు లక్ష్మి పిలుపునిచ్చారు.
