

టాలీవుడ్‌లో తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఎప్పటికప్పుడు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న హీరోల్లో ఎన్టీఆర్ ముందుంటాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రోల్ ఏదైనా లుక్ నుంచి డ్యాన్స్ వరకూ తనదైన స్టైల్, జోష్‌తో అదరగొడతారు. తన నటనతో పాత్రలో ఒదిగిపోతారు.
టెంపర్ , అరవింద సమేత లో సిక్స్‌ప్యాక్ లుక్‌తో షాక్ ఇచ్చిన ఆయన, దేవర కోసం బల్క్‌అప్ అయ్యాడు. ఇప్పుడు వార్ 2 తర్వాత, మరింత షార్ప్ లుక్‌తో వస్తున్నాడు. ఇక తాజాగా, తన పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ డ్రాగన్ కోసం “లీన్ అండ్ మీన్” లుక్‌లోకి వెళ్లిపోతున్నాడు.
లాస్ట్‌గా ‘వార్ 2’లో వింటేజ్ లుక్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో తనదైన లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
అయన పర్సనల్ ట్రైనర్ కుమార్ మన్నవ సోషల్ మీడియాలో షేర్ చేసిన జిమ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాడీని పూర్తి స్థాయిలో షేప్ చేసేందుకు ఎన్టీఆర్ చేసిన హార్డ్‌కోర్ వర్కౌట్స్, డెడికేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఫిట్‌నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ ఎన్టీఆర్ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘దేవర నుంచి వర, విక్రమ్ వరకూ. అన్నింటికంటే అత్యంత కఠినమైనది. మూవీ ఏదైనా క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ చూపే డెడికేషన్, అంకితభావం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆయన వర్క్, నిబద్ధత నాకు ఆనందం కలిగిస్తున్నాయి.’ అంటూ రాసుకొచ్చారు.
ఈ వీడియోలో కనిపించిన చిసెల్డ్ లుక్ పూర్తిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన క్యారెక్టర్‌కు తగ్గట్టే ఉందని అభిమానులు అంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఆయన లుక్ చూసి షాక్ అవుతున్నారు. ఈ స్థాయి వర్కౌట్స్, డెడికేషన్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ లో మరోసారి బ్లాస్ట్ ఇవ్వబోతున్నాడనే ఎక్స్పెక్టేషన్ పెరుగుతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ‘డ్రాగన్’ మూవీలో ఆయన ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ ఆ లుక్ కోసం శ్రమిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ మూవీస్‌ను మించి ఓ పవర్ ఫుల్ ఎలివేషన్ వచ్చేలా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.